S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటిని ‘నీటి పాండాలు’ అని పిలుస్తారు!

పాండాల్లా కళ్లచుట్టూ నల్లని చారలు, మూతివద్ద నల్లటి మందమైన లైనింగ్, మిగతా శరీరమంతా గ్రే కలర్‌లో ఉండి చూడటానికి ముచ్చటగా ఉండే ఈ వేల్‌జాతి జీవులను ‘నీటి పాండా’లుగా పిలుస్తారు. కాలిఫోర్నియా జలసంధి, మెక్సికో జలాల్లో కనిపించే ‘వక్విటా’ జీవజాతి దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 150కు మించి లేవు. చేపలవేట కోసం వేసే వలలే వీటి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ వలల్లో చిక్కుకుపోయి ఎక్కువసేపు కదలకుండా ఉండిపోవడం వల్ల ఆక్సిజన్ అందక అవి మరణిస్తున్నాయి. నీటిలో అట్టడుగున జీవించే ఈ జలచరాలు మనుషులు, పడవలకు దూరంగా వెళ్లిపోతూంటాయి. మిగతా వేల్‌జాతి జీవుల్లా ఇవి నీటిపైన గెంతడం, ఉపరితలంపైకి రావడం వంటివి చేయవు. సముద్ర అడుగున ఎక్కువగా జీవించడం వల్ల మురికి, మట్టి, ఇసుకతో ఆ జలాలు కలగలసి ఉండటం వల్ల వీటి కళ్లు సరిగా పనిచేయవు. దాదాపు వీటికి చూపు లేనట్లే భావించాలి. ఆహారాన్ని లేదా శత్రువులను ఇవి ‘ఎకో-లొకేషన్’ విధానంలో పసిగడతాయి.

- ఎస్.కె.కె. రవళి