S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జూన్ 4 నుండి 10 వరకు

ఎలా వుందీ వారం?
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

విజయం శ్రద్ధతోనే లభిస్తుందని గ్రహించండి. ఆర్థికంగా వెసులుబాటు. వ్యాపారాలు స్థితినిబట్టి చేయాలి. ఉద్యోగాలు చాకచక్యంతో నిర్వహించండి. అంకిత భావం అన్నింటా మేలు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మెలగాలి. శుభకార్యాచరణ జరుగుతుంది. నైపుణ్యం కొన్ని వ్యవహారాలలో కలిసి వస్తుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తి. స్ర్తిలు, దంపతులు అనుకున్నవి ఆలస్యంగానైనా సాధిస్తారు. స్పెక్యులేషన్ అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక ప్రగతి ఉత్సాహాన్నిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితాలందుకుంటారు. తలచిన పనులు సకాలానికి పూర్తవుతాయి. నూతన వ్యక్తుల పరిచయంతో ప్రయోజనాలందుకుంటారు. వృత్తి వ్యాపారాలందు వృద్ధి. ఉద్యోగ, వ్యవహార కార్యాలందు ఆశించిన ఫలితాలందుకుంటారు. దూర ప్రయాణాలు కలసి వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు లాభిస్తాయి. స్ర్తిలకు ఉద్యోగ మార్పులు. విలువైనవి కొనుగోలు చేయడానికి అవకాశాలు మెండు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. చిరుద్యోగులకు ఆర్థిక ఉన్నతి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. ఆలోచనలతో ముందుకు వెళ్లండి. ప్రయత్నానుకూలం. ప్రశంసలు, మన్ననలుంటాయి. కార్యాచరణకై మీ శ్రమ అనుకూలం. ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టున్నారు. నిర్ణయానికి వ్యతిరేకంగా పనులు చేయవద్దు. విద్య, వృత్తి, వ్యాపార రంగాలు వృద్ధిని అందుకుంటాయి. ఉద్యోగులు లౌక్యంతో ప్రగతిని సాధిస్తారు. విదేశీ యత్నాలు, స్ర్తిలు అనుకున్నవి అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆటంక రహితంగా కార్యాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావనుకున్న బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ రంగంలో మెళకువలు, నిర్ణయాత్మకం మేలు. వృత్తి, వ్యాపార, సాంకేతిక రంగాలు ఊపందుకుంటాయి. దంపతులు శక్తికి మించి వాగ్దానాలు చేయకండి. అనుకోని ప్రయాణాదులున్నాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. ఇతరుల సలహాలు తీసుకున్నప్పటికీ మీ నిర్ణయానుకూలంగా వ్యవహరించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. ఉత్సాహంతో అనుకున్న పనులు చేస్తారు. ప్రోత్సాహాలు అందుకుంటారు. వ్యాపారాలందు లాభప్రాప్తి. నూతన వస్త్ర, వస్తువులు అందుకుంటారు. దూరపు బంధువులు వస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు మీ చొరవతో ముందుకు వెళ్లనున్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. అర్హతకు తగ్గ ఫలితాలందుకుంటారు. ఒక వార్త మీకు ఆనందాన్ని విస్తరింపజేస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

నూతన ప్రణాళిక అమలుకు శుభ ప్రదం. కాలానుకూలంగా పైకం, పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పట్టుదల, ఉత్సాహంతో పనులు పూర్తవుతాయి. మిత్రుల సలహాలు ఉపకరిస్తాయి. ఆంతరంగిక వ్యవహారాలు బహిర్గతం చేయకండి. చేపట్టే వ్యాపార, వృత్తి, ఉద్యోగ రంగాలందు అభివృద్ధి. స్పెక్యులేషన్ జయప్రదం. రాబడే ధ్యేయం మేలు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ప్రగతిపథాన అన్ని రంగాల్లో ముందుంటారు. ప్రభుత్వ సంబంధమైన కార్యాలు పూర్తవుతాయి. ఆర్థిక స్థితి లాభదాయకం. ఇతరుల పనులందు మీ ప్రమేయం తగ్గించుకోండి. మాట పడకుండా జాగ్రత్త పడండి. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగాలందు అనుకున్న ప్రగతిని అందుకుంటారు. కొత్త పరిచయాలు ఉత్సాహపరుస్తాయి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. వస్తు, వస్త్ర ప్రాప్తి. ఆదరణ లబ్ధి. యుక్తిగా ఉండండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

తలచిన పనులు సానుకూలపడతాయి. వ్యాపార వృద్ధి. ధన లాభం. మిత్రులు సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం మెరుగవుతుంది. మనోబలంతో పనులు పూర్తవుతాయి. ఉత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంది. వినియోగించుకోండి. స్ర్తిలకు అధిక లాభాలు. ఖర్చులకు కళ్లెం వేయాలి. రుణ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. యధాలాపంగా ఏ పనీ చేయవద్దు. ఓర్పు నేర్పులే మీకు అండ. అప్రమత్తత మంచిది. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

శ్రమానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు అంచనాలకు అననుకూలత. ఆరోగ్యానికి ప్రాధాన్యత నివ్వండి. శుభకార్యాలందు మీ ప్రమేయం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఉన్నతిన ఉంటాయి. ఆలోచనలకు వ్యతిరేకంగా మెలగకండి. ఇతరుల సలహాలు తీసుకున్నప్పటికీ మీ నిర్ణయానుకూలంగా వ్యవహరించండి. రాబడే ధ్యేయం మేలు. రియల్ ఎస్టేట్ రంగంపై ఆలోచించండి. స్పెక్యులేషన్ సంతోషాన్నిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతతే ముఖ్యం. కార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాదులందు అప్రమత్తత అవసరం. ఇతరుల విషయాలందు జోక్యం వద్దు. ఉద్యోగ విధుల్లో అనుకూల వాతావరణం. దూర ప్రయాణాలున్నాయి. బుద్ధి బలంతో సమర్థంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. హితుల ఆదరణ లభ్యం. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక లాభాలను అందిస్తుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆందోళనలు తగ్గుతాయి. ఆర్థిక విషయాలు ఆలోచింపజేస్తాయి. నిరుత్సాహంతో పనులు చేయవద్దు. స్ర్తిలు, దంపతులు సమిష్టి సాయంతో పనులు పూర్తి చేస్తారు. సరైన ప్రణాళికతో ప్రయత్నాలు కొనసాగిస్తారు. జీవిత భాగస్వామి సలహాలను పాటించండి. బంధువుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపార, వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు వృద్ధిని అందుకుంటాయి. ఉద్యోగ రంగం ఉత్సాహాన్ని అందిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

స్పష్టతతో శుభకాలాన్ని వినియోగించుకోవాలి. గౌరవ మన్ననలు అందుకుంటారు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. నూతన బాధ్యతలు అందుకుంటారు. ఆర్థిక ప్రగతి. పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలందు జాగ్రత్త వహించండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు గతం కంటె మెరుగవుతాయి. స్ర్తిలకు శుభకాలం. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855