S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ మెరుపులు!

టాలీవుడ్‌లో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రేసు గుర్రం’లో ‘బూచాడే బూచాడే’ పాటలో మెరుపులు కురిపించిన అందాల భామ కైరాదత్ గుర్తుంది కదా. బాలీవుడ్ దర్శకుడు మథుర్ భండార్కర్ రూపొందించిన ‘క్యాలెండర్ గర్ల్’ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన ఈ బ్యూటీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘ట్రిపులెక్స్’ చిత్రం కోసం నగ్నంగా నటించేందుకు అగ్రిమెంట్ చేసుకొని సంచలనం సృష్టించిన కైరా కోలీవుడ్‌లోనూ ఐటమ్ పాటలతో యువతరం మతి పోగొడుతుంది. అవకాశాల కోసం దర్శకుడు పూరి జగన్నాథ్, కథానాయిక ఛార్మీలు ఏర్పాటు చేసిన పూరి కనెక్ట్స్‌ను ఆశ్రయించిన ఈ అమ్మడు, ఆ సంస్థ ద్వారా పూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బాలయ్య చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రీయ నటిస్తోంది.

-సమీర్