S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇద్దరూ.. హాట్ బ్యూటీలే!

బాలీవుడ్ భామలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనేల క్రేజ్ ఎన్నటికీ తగ్గనిదే. హిందీ చిత్రాల్లో తమ పాత్రల ద్వారా అందరి మనసులను కొల్లగొట్టిన ఈ బ్యూటీలు హాలీవుడ్‌లోనూ తమ శక్తి సామర్థ్యాలను చూపిస్తూ ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకుంటున్నారు. ఇదిలా వుంటే మరో హాట్ న్యూస్ ప్రస్తుతం సంచలనానికి దారితీసింది. అదీ.. వీరిద్దరి విషయంలోనూ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత హాట్ బ్యూటీ ఎవరని ఇటీవల ఒక పోల్ జరిగింది. ‘మాగ్జిమ్’ అనే పత్రిక నిర్వహించిన ఈ పోల్ 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే టాప్ 100 హాట్ బ్యూటీలను ఎంపిక చేసింది. ఇందులో అందరికంటే అగ్రస్థానంలో ప్రఖ్యాత మోడల్ హెయిలీ బాల్డ్‌విన్ నిలిచింది. టాప్ 100 జాబితాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా కూడా నిలిచారు. విశేషమంటే అదే మరి! హాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘ట్రిపుల్ ఎక్స్’తోనే దీపిక ఎన్నో ప్రశంసలందుకుంది. ప్రియాంకా చోప్రా కూడా ‘క్యాంటికో’ అనే అమెరికన్ టీవీ సీరిస్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రియాంక తొలిసారిగా నటించిన ‘బేవాచ్’ కూడా హాలీవుడ్‌లో ప్రియాంక స్టామినాను నిరూపించిందే. ఇలా ఇద్దరూ ప్రపంచంలో హ్యాట్ బ్యూటీలే!

సమీర్