S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (జూన్ 11 నుండి 17 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక ఉన్నతి. సాలోచనలతో ముందుకు వెళతారు. పనులు నిదానంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకర వాతావరణం నెలకొంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చేపట్టే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు సత్ఫలితాలను అందిస్తాయి. అవకాశాలను వినియోగించుకోవాలి. ప్రయాణాదులందు ఓర్పు అవసరం. ముఖ్యమైన పత్రాలు తారమారయ్యేట్లున్నాయి. పెట్టుబడి ఫలవంతం. పంతాలకు పట్టింపులకు పోవద్దు. స్పెక్యులేషన్‌తో రాబడికి మెళకువలు పాటించాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ప్రయత్నాలు ఫలిస్తాయి. రాబోయే వ్యయానికి మీ ఆదాయం కాపు కాస్తుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడపనున్నారు. సంతాన విషయాలలో శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదులు అంచనాలను మించుతాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మానసిక స్థిరత్వం అవసరం. ఉద్యోగావకాశాలు. స్పెక్యులేషన్ మిశ్రమం. ప్రయాణాదులు యోగిస్తాయి. మనోబలానికి తోడు ఆత్మీయులు తోడవుతారు. ఆలస్యంగానైనా అనుకున్నవి పూర్తి చేయనున్నారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక స్తోమత తృప్తినిస్తుంది. కార్యానుకూలత, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మీ అంచనాలు ఫలప్రదమవుతాయి. చేపట్టే రంగాలు లాభప్రదం. సమస్యలు పరిష్కరించుకుంటారు. బహుమతులు అందుకుంటారు. ఇతరుల సలహాలు సాయపడతాయి. ఏ విషయంలోనూ తొందరపాటు కూడదు. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ సభ్యులు ఆందోళన కలిగించేట్టు ఉన్నారు. వెసులుబాటుతో కార్యసిద్ధి. ఆనందప్రాప్తి. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభాలు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఆర్థిక ఆనందాన్ని పొందుతారు. ఆస్తి విలువలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సంతోషం మీకు ఆనందాన్నిస్తుంది. పైకం అనుకోని విధంగా ప్రాప్తిస్తుంది. ముఖ్య ప్రయోజనకర ప్రయాణాలున్నాయి. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రమాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. కోర్టు సమస్యలు అనుకోని విధంగా పరిష్కారమవుతాయి. నూతన ఆభరణాలు అందుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఆర్థిక పరిస్థితి అనుకూలం. రుణ విముక్తులు అవుతారు. అకాల భోజనం వద్దు. కొత్త పనులు చేపడతారు. విద్యార్థులకు అనుకూలం. అవకాశాలను సామరస్యంతో వినియోగించుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు సఫలం. పెద్దల సలహాలు ప్రయోజనకారి. శ్రమాధిక్యత. ఇంటి వాతావరణం సానుకూలం చేసుకోవాలి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. మిత్రులు శత్రువులు కాకుండా చూసుకోండి. తిరస్కారాలకు ఆస్కారం ఇవ్వకండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
పనులు పూర్తవుతాయి. వైర భావం కూడదు. ఆర్థిక మిశ్రమాలు, స్వల్ప మార్పులు. హితులకు సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపార, వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు పరిస్థితులకు లోబడి ఉంటాయి. మీ మార్గదర్శకతతో ముఖ్య కార్యక్రమాలు, శుభకార్యాలు జరుగుతాయి. పరిచయం లేకుండా కొత్తవారితో జాగ్రత్త వహించండి. ఇంటా బయటా సమస్యలున్నా పరిష్కరింపబడతాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
అభివృద్ధి అంతటా గోచరిస్తుంది. వాతావరణానికి అనుకూలంగా ప్రవర్తించాల. నిరుత్సాహానికి దరికి రానీయకండి. మీ మాటలు చేతలు ఇతరులను ఆకర్షిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు, ప్రణాళికలు, మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. అన్ని రంగాల వారికి గతం కంటె ప్రస్తుత స్థితి అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. స్పెక్యులేషన్‌తో రాబడికి మెళకువలు పాటించాలి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉన్నా, అదనపు పైకంతో గట్టెక్కుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ప్రయత్న పూర్వకంగా మెరుగవనున్నాయి. తొందరపాటు నిర్ణయాలు అనర్థదాయకం. శుభకార్యాలకు శ్రీకారం జరుగుతుంది. అతి అన్నింటా వర్జయేత్. ఆరోగ్యంకై ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాదులు యోగిస్తాయి. మనోబలానికి తోడు ఆత్మీయులు తోడవుతారు. ఆలస్యంగానైనా అనుకున్నవి పూర్తి చేయనున్నారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
మంచి ఫలితాలు నిర్మాణాత్మకంగా అందుకుంటారు. శ్రద్ధతో పనిచేస్తేనే గుర్తింపు వర్తింపు. మిత్రుల సహకారం, కొత్త పరిచయాలు ఫలవంతమవుతాయి. చేపట్టే వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు ఆలోచింపజేస్తాయి. ఉద్యోగులకు బదిలీలు. అన్నింటా లౌక్యంతో వ్యవహరించాలి. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభాలు. లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలుంటాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. వెసులుబాటుతో కార్యసిద్ధి. ఆనందప్రాప్తి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆర్థిక పరిస్థితి ఆమోదకరం. ఈర్ష్యాద్వేషాలు అవమానకరం. విజ్ఞులు, నిర్ణయాత్మకత సౌఖ్యప్రదం. స్ర్తిలకు ఉద్యోగావకాశాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊహించని విధంగా సానుకూల మార్పులు గమనిస్తారు. మీ పనులు మీరు పూర్తి చేసుకుంటేనే మంచిది. కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి. దంపతులు సఖ్యతతో ఉండాలి. అనుకోని ఖర్చు ఇబ్బందికరమా అనేది ఆలోచించాలి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
అందరి మన్ననలు అందుకుంటారు. సందేహంతో పనులు చేయకండి. మీ మాటలు అపార్థాలకు దారితీయనున్నాయి. జాగ్రత్త వహించండి. ఇంటా బయటా శుభకార్యాలందు పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు క్రమేపీ లాభిస్తాయి. ఇతరుల మాటలు పెడచెవిన పెట్టకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోర్టు విషయాలు అనుకూలం. తిరస్కారాలకు ఆస్కారం ఇవ్వకండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
పైకం సర్దుబాటవుతుంది. అనవసరంగా సమయాన్ని వృథా చేయకండి. వ్యధ, అపప్రధలతో కార్యాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల సాయం తీసుకోనున్నారు. అనుకున్నవి నత్తనడకన పూర్తి చేస్తారు. ఆస్తి ప్రయత్నాలు అప్రయత్నంగా మధ్యలో నిలిచేట్లున్నాయి. ఆందోళనలు, నిర్ణయాత్మక విధానాలు మేలు. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక లాభాలు అందుకోనున్నాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855