S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిత్రమైన కథ! ( చిన్న కథ)

‘నువ్వొచ్చి పనె్నండు రోజులైందిరా!’
‘అంత కచ్చితంగా ఎలా చెప్తావు’?
‘నాన్న ఫ్రెండ్ రోజూ పెరుగుతో ఒక చాక్లెట్ ఇస్తుంటారు. అది వాళ్ల స్నేహానికి ప్రతీక. పెరుగు నాన్నగారు, చాక్లెట్ నేను తీసుకుంటాం. దానికో సీసా వుంటుంది. నువ్వొచ్చినప్పుడు తీసి ఇస్తాను. ఎన్ని చాక్లెట్లు వుంటే నువ్వొచ్చి అన్ని రోజులైనట్లు’
‘నాకోసం ఎంతగా ఎదురుచూస్తావురా! మీ నాన్నగారి స్నేహం, మన స్నేహం ఒకటే. ఇంట్లో ఎవరడిగినా ఇవ్వకుండా నాకోసం వుంచుతావు’
‘ఇవి నువ్వు ఎవరికిస్తావురా?’
‘నా మనవడు రుషికి’
‘ఈ వయసులో నీకొక మనవడు. భలే చిత్రమైన కథరా నీది’
‘అవునురా! రెండేళ్ల క్రితం నా కొడుకు ప్రసాద్ ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికొచ్చి ఏడ్చాడు. వాడు పరీక్షలు సరిగా రాయనందుకు బాధపడుతున్నాడనుకొని నేను ఓదార్చాను. దాంతో వాడు అసలు కథ చెప్పాడు. నేను తెల్లబోయి అవధాని గారింటికి వెళ్లి విషయం చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పదహారేళ్ల మనవరాలిని నా కొడుక్కిచ్చి గుళ్లో పెళ్లి చేశారు. ఏడు నెలలకి రుషి పుట్టాడు. వాళ్లవారెవరూ నా కోడల్ని క్షమించలేదు. కూతుర్ని చూట్టానికి ఇప్పటివరకూ తల్లిదండ్రులు రాలేదు. అవధాని గారు మాత్రం అప్పుడపుడూ వచ్చి మునిమనవడితో ఆడుకొని వెళుతుంటారు. రెండేళ్లయింది. నా కొడుకు డిగ్రీ ఫైనల్‌కు వచ్చాడు. రుషి అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. బాబు అవధాని గారిలా తెల్లగా, పూర్తిగా ఆయన పోలికే. కులాంతరం అని చిందులేయకుండా ఆ పెద్దాయన తీసుకున్న నిర్ణయం.. చిత్రమైన కథలా సాగిపోయింది. నాకు చాలా ఆనందంగా వుంది!’

- కాశీభొట్ల సరస్వతమ్మ