S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బొచ్చులేని ‘స్పింక్స్’ పిల్లులంటే పిచ్చి

ప్రపంచంలో సంకరజాతి పిల్లుల్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవాటిలో బొచ్చులేని ‘స్పింక్స్’ జాతి పిల్లులకు ఎనిమిదో స్థానం దక్కింది. 1960లో సృష్టించబడిన ఈ పిల్లులకు మిగతావాటిలా బొచ్చు ఉండదు. అలాగని శరీరంపై వెంట్రుకలే ఉండవనికాదు. సన్నని ఉండీలేనట్లుండే వెంట్రుకలు ఉంటాయి. పెంపుడు శునకాల్లా యజమానిని చూసిన వెంటనే గారాలుపోతూ శరీరాన్ని తాకుతూ తిరగడం వీటి ప్రత్యేకత. యజమానికి ఎక్కడ కూర్చున్నా, చివరకు పడుకున్నా వారిని ఆనుకుని సేదదీరడం వాటికి ఇష్టం. ఇలాంటి లక్షణం పెంపుడు పిల్లులకు ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఇవి ప్రదర్శిస్తాయి. మిగతా పిల్లులకన్నా వీటి శరీర ఉష్ణ్రోగ్రత నాలుగు డిగ్రీలు అధికంగా ఉంటుంది. సాధారణ పిల్లులకన్నా చురుకుగా, ఉత్సాహంగా, ఉత్సుకతతో, కలివిడితనంతో వ్యవహరించడం వీటి ప్రత్యేక లక్షణం. ఒకరకంగా పెంపుడు శునకాల మాదిరిగా ఇవి ప్రేమతో వ్యవహరిస్తాయి. అన్నట్లు బొచ్చులేని ఈ పిల్లుల శరీరం ఒకే రంగులో ఉండడం అరుదే. అక్కడక్కడ ఇతర రంగుల్లో మచ్చలు కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి