S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 39

ఆ‘కైకేయి దగ్గర దశరథుడు తను చెప్పేది ఇలా కొనసాగించాడు. జాగ్రత్తగా చిత్తగించండి’ హరిదాసు చెప్పి ఆ రోజు కథని ఇలా చెప్పసాగాడు.
‘ఓ కైకేరుూ! కౌసల్యని, సుమిత్రని, నన్ను, రామలక్ష్మణ శత్రుఘు్నలని నరకంలో పడేసి నువ్వు సుఖంగా ఉండు. శాశ్వతమైనది, పూజింప తగ్గది ఐన ఇక్ష్వాకు వంశం ఇంతవరకు బాధించ శక్యం కాకుండా ఉంది. అలాంటి వంశాన్ని నేను, రాముడు విడిచి పెట్టాక నువ్వు పాలిస్తావులే. ఓ దుర్మార్గురాలా! నా శతృవైన ఓ కైకేరుూ! నీ కోరిక తీరుతుంది. మనుషుల్లో ఉత్తముడైన రాముడు అరణ్యానికి వెళ్లి, నేను మరణించాక విధవవై నీ కొడుకుతో కలిసి రాజ్యాన్ని ఏలుతావు. ఇంతకాలం నువ్వు రాజపుత్రి అనే పేరుతో నా ఇంట్లో నివసించావు. నీ మూలంగా నాకు గొప్ప అపకీర్తి, అవమానం తప్పవు. అన్ని ప్రాణులూ కూడా నన్ను పాపిలా చూస్తాయి. ఇంతవరకు ఓ ప్రభువుగా రథాల మీద, ఏనుగులు, గుర్రాల మీద ప్రయాణం చేయడానికి అలవాటుపడ్డ నా రాముడు మహారణ్యాలలో ఎలా నడుస్తాడు? రాముడి భోజనం వేళ కాగానే చక్కగా అలంకరించుకున్న వంట వాళ్లు ‘నేను ముందు, నేనే ముందు’ అని పోటీ పడుతూ రుచికరమైన ఆహార, పానీయాలనలి వడ్డించేవారు. అలాంటి నా కొడుకు అడవిలో వగరుగా, చేదుగా, కారంగా ఉండే ఆహారాన్ని తింటూ ఎలా జీవిస్తాడో! విలువ కట్టలేని బట్టలని ధరించి ఇంతకాలం సుఖంగా ఉన్న రాముడు ఇక మీదట కాషాయ వస్త్రాలు ధరించి ఎలా జీవించగలడు?
‘రాముడు అరణ్యానికి వెళ్లాలి, భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి’ అనే ఆలోచన లేని దారుణమైన మాటలు ఎవరివి? ఛీ! ఆడవాళ్లందరూ రహస్యంగా కీడు చేసేవాళ్లే. ఎప్పుడూ స్వలాభమే చూసుకుంటారు. అనర్థం కలిగించే ఆలోచన గలదానా! స్వార్థపరురాలా! క్రూరురాలా! నన్ను బాధ పెట్టాలనే నిర్ణయం చేసుకున్న దానా! నీకు నా వల్ల కాని, ఎప్పుడూ మంచే కోరే రాముడి వల్ల కనా ఏమి అయిష్టమైనది జరగబోతోందని అనుకుంటున్నావు? రాముడు కష్టాల్లో చిక్కుకోవడం చూసి ప్రపంచమంతా ఎదురు తిరుగుతుంది. తండ్రులు కొడుకుల్ని, ఇంతవరకూ ప్రేమగా ఉన్న స్ర్తిలు భర్తలని ఇక వదిలి పెట్టేస్తారు. చక్కగా అలంకరించుకున్న దేవతా కుమారుడిలా వచ్చే నా కొడుకుని చూడగానే నాకు చాలా ఆనందం కలుగుతుంది. మళ్లీ యవ్వనం లభించినట్లుగా అనిపిస్తుంది. సూర్యుడు లేకపోయినా, ఇంద్రుడు వర్షం కురిపించక పోయినా ప్రపంచం సాగచ్చు. కాని ఇక్కడ నించి వెళ్లిపోతున్న రాముడ్ని చూసిన ఎవరూ జీవించరని అనుకుంటున్నాను.
నా నాశనం కోరేదానివి, కీడు చేసేదానివి, శత్రువువి అయిన నిన్ను చావుని దగ్గర ఉంచుకున్నట్లుగా ఇన్నాళ్లు నా దగ్గర ఉంచుకున్నాను. గొప్ప విషం గల ఆడ సర్పాన్ని చాలాకాలం ఒళ్లో ఉంచుకున్నాను. ఆ పొరపాటు వల్ల ఈనాడు చంపబడుతున్నాను. నన్ను, రామలక్ష్మణులని వదిలేసి భరతుడు నీతో చేరి బంధువులు అందర్నీ చంపి నగరాన్ని, దేశాన్ని పాలించుగాక! నువ్వు నా శత్రువులకి ఆనందాన్ని కలుగజేసే దానివి అవుదువు గాక! కష్టాల్లో దెమ్బతీసే ఓ క్రూరురాలా! నువ్వు ఇలా కోరినందుకు ఇప్పుడు నీ పళ్లన్నీ వెయ్యి ముక్కలై ఎందుకు రాలడం లేదో కదా? రాముడు చెడ్డ మాటలు, రుచించని మాటలు ఏ మాత్రం మాట్లాడడు. కోపంగా మాట్లాడటం అనేది తెలీనే తెలీదు. ఈ విధంగా మనోహరంగా మాట్లాడేవాడు, సద్గుణాల వల్ల అందరి మెప్పునీ పొందేవాడు ఐన రాముడి విషయంలో తప్పులు ఎలా చెప్ప గలుగుతున్నావు?
‘కేకయ వంశానికే కళంకమైన దానా! నువ్వు ఏడ్చినా, కాలిపోయినా, నశించినా, వెయ్యి ముక్కలై నేల మీద పడినా, అతి దారుణమైన, నాకు ఇష్టం లేని నీ మాట వినను. నువ్వు మంగలి కత్తి లాంటి దానివి. నిత్యం అబద్ధపు ప్రేమ మాటలు మాట్లాడేదానివి. దుష్టురాలివి. మనసుకి బాధ కలిగించే దానివి. నా హృదయాన్ని సమూలంగా కాల్చేయడానికి పూనుకున్నావు. అలాంటి నువ్వు జీవించి ఉండటం నాకు ఇష్టం లేదు. రాముడు లేకపోతే నాకు జీవితమే లేదు. ఇంక సుఖం ఎలా ఉంటుంది? బతికుండగా నాకింక ఆనందం ఎక్కడిది? ఓ దేవి! నాకు ఇష్టం లేని ఈ పని చేయద్దు. నీ కాళ్లు పట్టుకుంటాను. నన్ను అనుగ్రహించు’
మర్యాదని అతిక్రమించిన భార్య వల్ల హృదయానికి బాధ కలగగా, అనాధలా విలపించే దశరథుడు తన పాదాలని ఎక్కడ తాకుతాడో అని వెనక్కి వెళ్లిన కైకేయి పాదాలని ముట్టుకుని రోగగ్రస్థుడిలా నేల మీదకి వాలిపోయాడు.
హరిదాసు ఈ మాటలతో ఆ రోజు కథని ముగించాడు.
‘అయ్యా! అదీ ఈ రోజు కథ. రేపు పనె్నండో సర్గలోని మిగిలిన భాగాన్ని విందురు గాని’ (అయోధ్యకాండ సర్గ 12 - శ్లోకం 91 నించి 114)
ఆశే్లష బయటికి వెళ్లబోయే ముందు హరిదాసు చెప్పిన ఆ రోజు కథలో తప్పులు ఉన్నాయి అని ఐదుగురు లేచి ఆయనకి ఐదు తప్పులని చెప్పడం విన్నాడు. ఆయన వెంటనే ఆ సర్గ తెరచి చూసి అది నిజమేనని ఒప్పుకున్నాడు. వాటిని మీరు కనుక్కోగలరా?

*
మీకో ప్రశ్న
కేకయ సామ్రాజ్యం
ఇప్పుడు ఎక్కడ ఉంది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
సగరుడి అరవై వేల మంది కొడుకులు కాలి బూడిదైన
కపిల మహర్షి ఆశ్రమం నేడు ఎక్కడ ఉంది?

- గంగా సాగర్, వెస్ట్ బెంగాల్
*
కిందటి వారం ప్రశ్నలకు జవాబులు
1. పూర్వీకుల చరిత్ర చెప్పినప్పుడు కైకేయి ‘అలర్కుడు తన కళ్లని దానం చేసి ఉత్తమ గతిని పొందాడు’ అని చెప్పింది. దీన్ని హరిదాసు చెప్పలేదు.
2. ‘పైకి లాభంగా కనిపించే ఈ అనర్థమైన ఆలోచనని నీకు ఎవరు చెప్పారు?’ అని కైకేయిని దశరథుడు ప్రశ్నించిన సంగతి హరిదాసు చెప్పలేదు. (దశరథుడికి కైకేయి మంచిది అనే అభిప్రాయం)
3. రాముడ్ని కాదని భరతుడు ఏ విధంగానూ రాజ్యాన్ని అంగీకరించడు. ఎందుకంటే ధర్మం విషయంలో రాముడి కంటే కూడా భరతుడు ఎక్కువ పట్టుదల కలవాడని నా అభిప్రాయం అని దశరథుడు చెప్పిన మాటలని కూడా హరిదాసు చెప్పలేదు.
4. కైకేయి బలవంతం చేయడంతో రాముడ్ని అడవికి పంపాను’ అని నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అది అబద్ధం అనుకుంటారు అని దశరథుడు చెప్పాడు. కాని ‘కైకేయి బలవంతం చేయడంతో రాముడ్ని అడవికి పంపాను’ అని చెప్పనా? అన్నట్లుగా హరిదాసు తప్పు చెప్పాడు.
5. నువ్వు తప్పక విధవవై నీ కొడుకుతో కలిసి రాజ్యాన్ని ఏలతావు అని దశరతుడు కైకని నిందించిన ముఖ్యమైన నిందని హరిదాసు చెప్పలేదు.
6.90 శ్లోకంతో సర్గ 12 పూర్తి కాలేదు. ఇంకా 24 శ్లోకాలు ఈ సర్గలో మిగిలి ఉన్నాయి.

మల్లాది వెంకట కృష్ణమూర్తి