S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాస్‌వర్డ్

పాస్‌వర్డ్
‘సండే గీత’లో -పాస్‌వర్డ్.. అతని జీవితాన్ని ఎలా మార్చివేసిందో హృద్యంగా చెప్పారు. చాలా బాగుంది. లాబ్రడార్ శునకం తన పిల్లలతోబాటు పంది పిల్లలకు కూడా పాలిచ్చి పెంచడం ఆశ్చర్యమే. అయితే దానికి మానవ సహజ ప్రేమ లాంటి భావనలు జోడించనక్కరలేదు. కాకి తనే సాకిన కోకిల పిల్లల్ని తరిమేసినట్టు పంది పిల్లలు పెరిగాక శునకం కూడా వాటిని తరిమేయవచ్చు. అక్షరాలోచనల్లో ‘ఒక్కో వాక్యం’ కవిత చాలా బాగుంది.
-పి.శాండిల్య (కాకినాడ)
ఆయువు
వైద్యుడు రోగులకు స్వస్థత చేకూర్చితే స్వస్థత పొందిన వారి కృతజ్ఞతా పూర్వక శుభకామనలే వైద్యుని ఆయువు పెంచుతాయన్న ‘సండే గీత’ అద్భుతం. బుద్ధుని సైకత శిల్పం, నీటి బుడగలతో నిరశన అంశాలు మెప్పించాయి. అక్షరాలోచనల్లో ‘జ్ఞాపకాల పుప్పొడి’ చాలా బాగుంది. ‘గాడి తప్పిన గతాన్ని నెమ్మది నెమ్మదిగా నీ మదిలో నుంచి తుడిచేసుకో. మరపు ప్రకృతి మనిషికిచ్చిన వరం’ అన్న పదాలు గొప్పగా ఉన్నాయి. ‘బాహుబలి-2 గొప్ప కామెడీ. మాయాబజార్ ముందు దిగదుడుపునకు కూడా పనికిరాదు’ అనడం మరింత బాగుంది.
-డి.అభిలాష (సాంబమూర్తినగర్)
అమృత వాక్కు
ఆంధ్రదేశంలో దక్షిణాది సంగీత సంప్రదాయాన్ని నెలకొల్పినా శిష్యుల్ని పెద్దగా తయారుచేయలేక పోయినందుకు మహాలోపం కమ్ముకుందన్న అమృతవాక్కు ఎంతో నిజం. ‘అమృతవర్షిణి’ శీర్షిక ద్వారా ఎనె్నన్నో సంగతులను తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు. మామూలు మనుషులు కూడా ప్రపంచాన్ని మార్చగలరన్న ‘ఓ చిన్న మాట’ బహు మిన్నగా ఉంది. కాలం అయినా, దూరం అయినా వాటంతట అవి ఉండగలిగే కొలతలు కావు. వాటికి సంబంధించిన స్థానం ఉండాలి అంటూ గోపాలంగారు చెప్పిన శాస్త్ర విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
-ఎన్.గిరిధర్ (తూ.గో.జిల్లా)
వేగం..
జీవితమంటే లెక్క లేదు. ప్రాణాలంటే భయం లేదు. ఏమీ అవదులే అన్న ధీమాతో అతి వేగంగా బళ్లు నడిపి తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక రోడ్డునపోయే అమాయకులను కూడా మృత్యుముఖంలోకి పంపుతున్న యువత నిర్లక్ష్యం భీతిగొల్పుతున్నది. అతి వేగం సమస్యపై కవర్‌స్టోరీ ‘వేగం, ఖేదం’ ఆలోచింపజేసేదిగా ఉంది. క్రైం కథ ‘ఫ్రెంచ్ వాళ్లింతే’ తమాషాగా ఉంది. అందమైన భార్య ఉన్న వ్యక్తి కురూపిని బలాత్కరించలేడన్న ఫ్రెంచ్ పోలీసుల వింత అభిప్రాయం కొత్తగా ఉంది. ఈ అనువాద క్రైం కథలు విభిన్న కథా వస్తువులతో ఆకట్టుకొంటున్నాయి. ‘మీకు మీరే డాక్టర్’ శీర్షికన రక్తపోటు తగ్గించే భోజన విధానం ఉపయుక్తంగా ఉంది.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
టెలీపతి
రాత్రి భార్యతో గొడవపడి కోపంగా జాన్సన్ బయటకు పోవడం, తెల్లవారినా ఇంటికి రాకపోవడం, అతడు ప్రమాదంలో చిక్కుకొని తననే పిలుస్తున్నట్టు భార్య కెరోల్‌కి బలంగా అనిపించడం, ఆమె పోలీసులకు చెప్పడం, పోలీసుల సెర్చింగ్‌లో నిజంగా జాన్సన్ ప్రమాదంలో కనిపించడం అంతా ఉత్కంఠభరిత టెలీపతి ఫలితం. మనం నమ్మినా నమ్మకపోయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సోనేపట్‌కి చెందిన పదహారేళ్ల బాలుడు 11 వేల ఓల్టుల కరెంట్ తనలోనికి పోనిచ్చి చెక్కు చెదరకపోవడం దిగ్భ్రమ కలిగించే ఉదంతమే. నాయకత్వం ఒక నిష్కామ కర్మ అంటూ వసంత్‌కుమార్ గారు కొత్తగా నిర్వచించడం బహుదా ప్రశంసనీయం.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
వృత్తి
సండేగీత ‘వైద్యం’ జీవిత కాలాన్ని పెంచింది. అది వైద్యం కాదు. స్వస్థత చేకూరిన తరువాత తిరిగి హుషారుగా అలవాటైన వృత్తిలో ప్రవేశిస్తే అదే చైతన్యపరచి మరణాన్ని కొంతకాలం దూరం చేస్తుందనేది నిజం. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏభై - అరవై ఏళ్ల మధ్య వయసులో గుండె ఆపరేషన్ జరిగింది. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మరో ఐదు పదేళ్లు జీవించవచ్చునని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఆయన తరువాత తన వృత్తి అయిన నటనలోకి వెళ్లి మరో ముప్పై సంవత్సరాలు నిశ్చింతగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపలేదా?! వృత్తి మనోధైర్యాన్ని ఇస్తుందని చెప్పడానికిదో ఉదాహరణ. ఓ చిన్న మాటతో ఓ మామూలు మనిషి గాంధీ, నెల్సన్ మండేలాల కంటే ఒంటరిగా ఊరంతటికి శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపాడు. ఇలాంటి వారు మన సమాజంలో ఇంకా ఉన్నారు. ఎవరూ గుర్తింపు కోసం పని చేయడంలేదు. విమానం తయారీలో తెలుగువాడు, ‘అమృతవర్షిణి’ కొత్త సంగతులను తెలియజేశాయి. పరిమితి మించిన వేగం ప్రాణాలను తీస్తుందనే బోర్డులు ఎన్ని ప్రదర్శించినా ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం కలగడం లేదు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
నిర్లక్ష్యం
ఈ వారం అట్ట మీద బొమ్మ చూస్తేనే మనసు అదోలా అయిపోయింది. అసలు మనుషులు ఎందుకు ఇలా అజాగ్రత్తగా ఉంటున్నారు. దేని కోసం ఆరాటం. ఈ కాలం యువకులకు అసలు చెప్పలేక పోతున్నాం. ఎవరికో జరిగింది మనకు జరగదు అన్న పిచ్చి ధీమాతో ఉంటున్నారు. ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మక తప్పదేమో. ‘అక్షరాలోచనలు’లో జ్ఞాపకాల పుప్పొడి చాలా బాగుంది. నిజమే. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోకుండా మరిచిపోయి ముందుకు సాగాలి. అదే జీవితం. ‘అమృతవర్షిణి’ శీర్షిక మమ్మల్ని ఎంతగానో అలరిస్తోంది. ఆనాటి సుప్రసిద్ధ గాయనీ గాయకుల సంగీత విశేషాలను తెలుసుకొనే అవకాశం లభిస్తోంది. ‘నమ్మండి ఇది నిజం’లో టెలీపతి బాగుంది. మనం గట్టిగా ఏమైనా అనుకుంటే అది అవతల వారికి తప్పకుండా అందుతుంది అన్నది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది.
-డి.వి.తులసి (విజయవాడ)