S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరోసారి..!

మోడలింగ్ నుంచి వెండితెరపైకి అడుగుపెట్టిన మేఘా ఆకాష్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుసగా ఆఫర్లను చేజిక్కించుకుంటూ ఆడిపాడుతోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆమె చిత్రాలపై మోజు పెంచుకుంటున్నారు. పరిశ్రమ కూడా ఈ అమ్మడినే ప్రోత్సహించడానికి ముందుకు వస్తోంది. ‘అ..ఆ..’ చిత్రంతో యాభై కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన యువ హీరో నితిన్, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘లై’ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి హాను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విదేశాల్లో షూటింగ్‌ని జరుపుకుంటోంది. నితిన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో నితిన్‌కు జోడీగా మేఘా ఆకాష్ నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పూర్తికానుండటంతో నితిన్ తన తదుపరి చిత్రం మీద దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ‘రౌడీఫెలో’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులో కూడా నితిన్ సరసన ‘లై’ ఫేం మేఘా ఆకాష్‌నే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాహ్..మేఘా!

-సమీర్