S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రేవతి దర్శకత్వంలో...!

బాలీవుడ్‌లో ‘క్వీన్’ చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. ఇంతటి ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని చాలా రోజులుగా సౌత్‌లో రీమేక్ చేసేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ ‘క్వీన్’ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రంగా విశేషంగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మొదటగా తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించాలని భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా ముఖ్య పాత్రలో ‘క్వీన్’ను రీమేక్ చేయడానికి ప్లాన్ చేశారు. అందాల భామ తమన్నా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం దీనిని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకే సిద్ధంగా వున్నాడు. అందుకే ముందుగా కన్నడలో రమేష్ అరవింద్ దర్శకత్వంలో పరుల్ యాదవ్ ముఖ్య పాత్రలో చిత్రాన్ని ప్రారంభించాడు. తర్వాత తమన్నా ప్లేస్‌లో మరో కథానాయిక కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తాజాగా కాజల్ అగర్వాల్ ఈ రీమేక్‌లో నటించేందుకు అంగీకరించింది. రేవతి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

-సమీర్