S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అన్నిటికన్నా గొప్పది (కథాసాగరం)

వీరేశం మహాభక్తుడు. దేవుడి పటానికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు చేసేవాడు. శ్రద్ధగా ప్రార్థనలు చేసేవాడు. అతని భక్తిని చూసిన ఒక మిత్రుడు సంతోషించి ఒక శివలింగాన్ని ఇచ్చి శ్రద్ధగా ఈ శివలింగానికి పూజలు చెయ్య. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి’ అన్నాడు.
వీరేశం శివలింగాన్ని ఎంతో భక్తితో పూజిస్తూ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది శివలింగమే అనుకున్నాడు. దీప ధూపాలతో పాటు రోజూ శివలింగానికి ఒక అరటిపండు సమర్పించేవాడు. తెల్లవారి లేచి చూస్తే ఆ అరటిపండు కనిపించేది కాదు. ‘ఆహా! దేవుడు నా భక్తికి మెచ్చి అరటి పండు రోజూ తింటున్నాడు’ అని వీరేశం తెగ ఆనందపడిపోయాడు.
ఒకరోజు దేవుడికి అరటిపండు సమర్పించి పక్కగదిలోకి వెళ్లాడు. కాసేపటికి శివలింగానికి మళ్లీ నమస్కరించాలని బుద్ధిపుట్టి పూజా గదిలోకి వచ్చాడు. అప్పుడే ఒక ఎలుక వచ్చి అరటిపండు తినడం కనిపించింది. ఆ దృశ్యం చూసి వీరేశానికి జ్ఞానోదయమయినంత పనయింది. పొరపాటున ఇన్నాళ్లు శివలింగం గొప్పదనుకున్నాను. శివలింగం తినలేని అరటిపండును ఎలుక తింటోంది. కాబట్టి ఎలుకే శివలింగం కన్నా గొప్పది అని నిర్ణయించుకుని ఎలుకను పూజించడం మొదలుపెట్టాడు. వీరేశం ఏమీ అనకపోయేసరికి ఎలుక స్వేచ్ఛగా వచ్చి అరటిపండు భోంజేసి వెళ్లేది. అది వచ్చినపుడు వీరేశం చేతులు జోడించి ప్రార్థించేవాడు.
వీరేశం ఒక రోజు ఎలుక ప్రార్థనలో వుంటే పక్క గదిలోంచీ దూసుకొచ్చిన పిల్లిని చూసి ప్రాణభయంతో ఎలుక పారిపోయింది. ఆ శబ్దానికి కళ్లు తెరచిన వీరేశం ఆ దృశ్యాన్ని చూసి ఎలుక కాదు పిల్లే అన్నిటికన్నా గొప్పదని పిల్లికి నమస్కరించి దానికి రోజూ పళ్లూ పాలూ సమర్పించి ప్రార్థించటం మొదలుపెట్టాడు. వీరేశం కొడుకు వెంట ఒకరోజు ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క పిల్లిని చూసి తరిమింది. పిల్లి భయంతో గోడదూకి పారిపోయింది. ఈ మహత్తర దృశ్యం చూసిన వీరేశం అందరికన్నా గొప్ప దేవుడు కుక్కే అని ఆ కుక్కకు నమస్కరించి దానికి అన్నం పెట్టి దాని పాదాలకు నమస్కరించాడు. ఒకరోజు ఆ కుక్క వంటింట్లోకి వెళ్లి గినె్నలోని అన్నం తింటూ ఉండడం చూసి వీరేశం భార్య కట్టె తీసుకుని కొట్టింది. ఆ దెబ్బతో కుక్క కుయ్యోమొర్రో అంటూ అరచుకుంటూ కుంటుకుంటూ వీధిలోకి పరుగెత్తింది.
ఈ దృశ్యం చూసిన వీరేశం వింత అంటే ఇదే కదా! కుక్క కాదు అసలు దైవం నా భార్య ఆని ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. భర్త తత్త్వం తెలిసిన ఆమె పట్టించుకోలేదు. ఒకరోజు భార్య ఎంతసేపటికీ వంట ముగించలేదు. వీరేశంకు ఆకలి ఎక్కువైంది. కోపం వచ్చి కర్ర తీసుకుని ఆమెను కొట్టబోయి ఆగి ఆలోచనలో పడ్డాడు. నా భార్యకన్నా గొప్పవాణ్ణి నేనే. అంతేకాదు. అసలు దేవుణ్ణి నేనే! అని అద్దంలో తనకు తను నమస్కరించి తనని తన పూజించుకున్నాడు. కానీ ఇదంతా ఆకలి వల్ల వచ్చింది. ఆకలి కడుపులో ఉంది. కాబట్టి అసలు దైవం కడుపే అనుకుని కడుపునకు నమస్కరించడం మొదలుపెట్టాడు.

- సౌభాగ్య, 9848157909