S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

సి.మనస్విని, విజయవాడ
ఐ.ఐ.టి లాంటి ఉన్నత విద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ పేరుతో - విద్యార్థులు గోమాంసం ముక్కలను చేత్తో పట్టుకొని చీకుతూ ఆందోళన చేయడం ఏమిటి?
బుద్ధిలేని పని.

కేంద్ర ప్రభుత్వ ఆదేశంలో పశువుల సామూహిక అమ్మకం వద్దు అని మాత్రమే ఉంది గాని - బీఫ్‌పై నిషేధం లేదని కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పి - మీరు వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి గాని అసలు ముందు ఆ ఆదేశంలో ఏముందో చదవండి అని సలహా ఇచ్చింది. పిన్నరాయిగారికి ఇదేమీ పట్టదా? ఏం ముఖ్యమంత్రి ఆ పెద్దమనిషి?
అటువంటి ‘బండరాయి’లు దేశంలో ఇంకా చాలా ఉన్నాయి.

ఆర్.శాస్ర్తీ, హైదరాబాద్
సినిమా షూటింగ్స్‌కి ఆలస్యంగా వచ్చి గొప్పగా అనుకునే కొందరు నటులలాగా, వ్యయ ప్రయాసలతో తయారుకాబడ్డ వేదికలపైకి పురస్కార గ్రహీతలు కొందరు వేళమించి రావడం, ఆర్గనైజర్లకి కంగారు కలిగించడం, కొందరు తొందరగా నిష్క్రమించడం, కార్యకర్తలకు తలనొప్పే కదా! సత్కారాలకు ఒప్పుకుని, ఇలా రావడం సంస్కారమేనా?
వారి దృష్టిలో అది దర్జా.

జ్ఞానేశ్వర్, హైదరాబాద్
సుబ్రహ్మణ్య స్వామి వారు చదువురాని మొద్దు రజనీకాంత్ రాజకీయాలకు పనికిరాడని అంటున్నారు. ఇలా అనడం సమంజసమేనంటారా? డిగ్రీలు లేని ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అక్షర జ్ఞానం లేనివారు కూడా మంత్రులు ముఖ్యమంత్రులు కాగలిగారు. ప్రజలకు మంచి చెయ్యడానికి కావలసింది నిజాయితీ కాని చదువులెందుకు?
చదువుకున్న మొద్దులకంటే అతడు మేలు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
మోదీగారి పాలన పూర్తయ్యేసరికి భారతరత్న యిచ్చేస్తారంటారా? ఇంతవరకు ఈ బిరుదొచ్చిన కొంతమందితో పోలిస్తే మోదీగారు రత్నానికి అర్హుడేననిపిస్తోంది. నా అంచనా కరెక్టేనంటారా?
ఇచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు. అది చాచానెహ్రూ చూపిన బాటే.

ఎన్టీ రామారావుకు భారతరత్న యివ్వాలని ప్రతి మహానాడులోనూ తీర్మానిస్తూంటారు. కాని ఇవ్వరు. ఏళ్లు గడుస్తున్నాయి. అసలిస్తారంటారా?
వీళ్లే ఇవ్వనివ్వరు.

జి.మురళీకృష్ణ, రేపల్లె
పత్రికలలో నిర్భయ చట్టంలో చేర్చిన సెక్షన్లు, శిక్షలు చదవగానే ‘బాబోయ్’ అనిపించింది. ఇక నుంచీ, ‘పట్టపగలు మగవాడు బయట తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ అనుకోవాలేమో!
ఎవరికి? రేపులు చేసే మగాడికా?

పుష్యమీసాగర్, హైదరాబాద్
టీవీలో హాస్యం పేరుతో మహిళలను కించపరిచే కార్యక్రమాలను, ఆడవాళ్లను విలన్లుగా చూపించే సీరియళ్లని నిషేధించేలా చేయలేమా? చిన్ని తెరకి సెన్సార్ ఉండాల్సిన అవసరాన్ని ఆలోచించాలి కదా?
దేశానికి నీతులు చెప్పే రాజగురువులే తమ చానళ్లలో బూతును పెంచి పోషించేటప్పుడు ఇలాంటివి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు పట్టించుకుంటారు?

చట్టసవరణ చేసి మరీ ఒక క్రీడాకారిణిని ప్రభుత్వ అధికారిగా నియమించారు. ఒక్క పతకము తెచ్చిన వారికి కోట్లు కోట్లు కుమ్మరించింది చాలదా...? ఇంకా చట్ట సవరణలు చేసి ఉద్యోగాలు కూడా ఇస్తుంటే, వేల కొలది నిరుద్యోగులు, గ్రూప్ ఎగ్జామ్స్ కోసం ఎదురుచూసే వాళ్లు ఏమి కావాలి? రాష్ట్ర స్థాయిలో పతకం తెచ్చిన వారికి రైల్వేలో, బ్యాంకులలో ఏమి పరీక్ష లేకుండానే నియమించబడతారు. మరి అలాంటప్పుడు చదువుకోడం ఎందుకు?
పాయింటే. సర్కారు వారు ఏది చేసినా అతే!

డా. ఎం.శ్రీనివాస్, వరంగల్
తెలంగాణలో తెరాస మరియు భాజపాల మధ్య స్నేహం పొత్తు పొడుస్తుంది అనుకునే సమయంలో అమిత్ షా గారొచ్చి రచ్చ చేశాడు. ఎందుకని సార్?
పొత్తు అక్కర్లేదు కనుక.

ఎ.వి. సోమయాజులు, కాకినాడ
ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణాన్ని తెలుగుదేశం పార్టీవారి మూడు రోజుల మహానాడు కోసం రాజకీయ వేదికగా వినియోగించడంపై కోర్టువారు సకాలంలో తమ తీర్పు ఇచ్చి ఉండాలి కదా?
సాధారణంగా మన కోర్టుల తీర్పులు ఒక జీవితకాలం లేటు.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net