S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘మిరప’ ఘోష

సన్నగా పొందిగ్గా
పొడుగ్గా పెరిగి
పక్వానికొచ్చి
ఎర్రగా మిలమిల మెరిసే
నన్ను అల్లారుముద్దుగా పెంచుకున్న
నా రైతు బతుకుటకై
మార్కెట్టుకు తరలించగా
వేలంలో వెర్రిగా బలై
కూడబలుక్కున్న దళారీల దగుల్బాజీల
మూడుముక్కలాటలో
ముప్పుతిప్పలపాలై
అప్పుల రొంపిలో
ఎగబోస్తూ ఎగాదిగా
తూలనాడుతూ
తక్కెడలో తూస్తున్న నన్ను చూసి
బోరుమని విలపిస్తుంటే
ఓదార్చలేని నేను
దళారీ బస్తాలో తొక్కేస్తుంటే
నా ఘోష నా రైతు ఘోష
పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తుంటే
ప్రతిస్పందనే కరువాయె
నీరోల పాలనలో నేనే మిరపకాయని
సీమ టపాకాయలా పేలితే
ఏలికల కళ్లల్లో మంటలు
దారి కానరాక భవిత శూన్యమే

- గిరిప్రసాద్ చెలమల్లు 9493388201