S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూగజీవాలు

అలా ఒంటికాలితో
జపం చేస్తున్నదేం
కొంగ
చేపల్ని వేటాడ్డానికా...

కావ్... కావుమంటూ
మందిని కాకి
పిలుస్తున్నది
సమష్టి ఆరగింపుకా...

తోటంతా గాలించి
శోధించీ చిలుక
ఓ తియ్యని జాంపండుని
సాధించి వదిలి వెళ్లిందే...

నీళ్లలో కలిసిపోయాయ
పాలన్నీ... బెంగెందుకు
హంస వాటిని
విడదీసి చూపుతుంది...
పంటంతా కోసేసి
నీళ్లు పెట్టారు
బాతులు బాత్ చేస్తూ
ఎరువుని అందిస్తున్నాయ...

పల్లెసీమ ఇళ్ల
చూరులో వరికంకులు
పొడుచుకు తినే
పిచ్చుకల జాడే లేదు...

కారు మేఘాలు
ఆకాశం నిండా పరుచుకుని
నేలమీది నెమలికి
నాట్యభంగిమలు నేర్పుతున్నాయ...

- ఎన్.కె. నాగేశ్వరరావు, 9030360988