S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( జూన్ 25 నుండి జులై 1 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సౌఖ్యాలుంటాయి. కుటుంబ విస్తరణకు అవకాశం. శుభకార్యాలు అనవసరంగా ముందే బహిర్గతం చేయకండి. ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ వ్యవహారాలు అందర్నీ ఆకర్షితులను చేస్తాయి. కలుపుగోలుతనం మంచిది. ప్రలోభాలకు లొంగకండి. ఆరోగ్య విషయంలో మెళకువలు పాటించండి. మిత్రుల సాయం అందుకుంటారు. ఆలోచనలు, అవకాశాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి. స్పెక్యులేషన్‌లో తృప్తి.
1వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వివాదాలు వద్దు. ద్వేష విద్వేషాలకు దూరంగా ఉండండి. చలాకీతనం మీకు మేలు చేస్తుంది. అనుకున్న పనులు ప్రణాళికాబద్దంగా చేస్తే ప్రమోదాన్ని అందిస్తుంది. స్థాన చలనాలకు ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఆస్తి విషయాలందు జాగ్రత్త మంచిది. వృత్తి, వ్యాపార వ్యవహారాదులు అనుకున్నట్లు మెరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు శ్రమపై ఫలవంతమవుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. పెట్టుబడులు, రాబడులు శుభ మార్గాన ఉంటాయి. ఒక వార్త అందర్నీ సంతోషపరుస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

విమర్శలకు తావు లేకుండా మెలగండి. ఆర్థిక వెసులుబాటుకై ప్రయత్నించాలి. అనుకున్నట్లు కార్యసిద్ధికై అనుకూల వాతావరణముంటుంది. సుఖప్రదమైన శుభాలకు వ్యాపార, ఉద్యోగాలు తృప్తినిస్తాయి. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. విద్యారంగ విషయాలు ఫలవంతమవుతాయి. స్పెక్యులేషన్‌లో దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. కొన్ని అసంపూర్ణ కార్యాలు పూర్తి చేస్తారు. శ్రమిస్తేనే ఆనందాన్ని అందుకుంటారు. పోటీలందు ప్రణాళికా పరంగా పాల్గొనండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అదృష్టం కలిసి వస్తుంది. దైవచింతన మెరుగవుతుంది. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేయండి. కొన్ని ప్రయత్నాలు ఇబ్బంది పెట్టనున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో శుభ, సౌఖ్య వాతావరణం, సంతోషాలుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, వైద్య రంగాలు ఆహ్లాదాన్నిస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక ప్రయత్నాలు సరిసమానం. అవసరం మేరకు అప్పు చేయవలసి వస్తుంది. వ్యయ నియంత్రణ అవసరం. విమర్శలు వద్దు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలందు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. నూతన వస్త్భ్రారణాలు ధరిస్తారు. కీర్తి ప్రతిష్టలుంటాయి. స్ర్తిల కార్యాలు మందకొడిగా కొనసాగుతాయి. మిత్రులు సహకరిస్తారు. శత్రుత్వం తగ్గించుకోవాలి. స్పెక్యులేషన్ మిశ్రమం. అనుకోని పైకం వారాంతంలో వచ్చేట్లుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
పైకం సమయానుకూలంగా అందుతుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఆదాయ వ్యయాలు తృప్తికరం. పనులు అనుకున్నవి సకాలంలో పూర్తి చేసుకుంటారు. క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం. ఉద్యోగానికి అవసరమైన వాటిల్లో మంచి ఫలితాలు పొందుతారు. శుభకరమైన కాలం. అనుకోని ప్రయాణాలున్నాయి. వాహన సౌఖ్యముంది. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
పరిష్కారాలు ఆవిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆలోచనతో చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ రంగాల వారు శ్రమకు అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. శుభకార్యాల ప్రణాళికలు, పథకాలు ఉత్సాహపరుస్తాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఉంటాయి. బంధువులు, మిత్రుల రాక ప్రయోజనకరం. జీవనోపాధి మార్గాలు ఆసక్తికరంగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ ఆలోచించి ముందుకు వెళ్లండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం కంటె ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అనుకున్న ప్రణాళికల మేరకు కార్యసిద్ధికై ప్రయత్నించండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహార రంగాలు ఇతరుల సాయంతో ముందుకు వెళ్లవలసి వస్తుంది. శుభకార్య యత్నాలు నత్తనడకన వున్నా అంతిమంగా ఫలవంతమవుతాయి. ఆస్తి సంపాదనకై ప్రయత్నాలు అనుకూలం. కుటుంబ వ్యవహారాలకు సమయం కేటాయించవలసి వస్తుంది. పెట్టుబడి రాబడి సంతోషాన్నిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆలోచనలకు, వనరుల మేరకు ఆర్థిక లావాదేవీలు నిర్వర్తించాలి. సమయానుకూలంగా అనుకున్న పనులు చేయండి. వృత్తి, వ్యాపారాలు పాత పంథాలోనే కొనసాగనివ్వండి. ఉద్యోగ విధానాల్లో సమస్యలు వున్నా నేర్పుతో పరిష్కరించుకోవాలి. యోగ్య కార్యాలు నిర్వర్తించుకో గలుగుతారు. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలాలను అందిస్తుంది. విద్య విషయాలందు ఆసక్తిని కనపరచండి. శ్రమిస్తేనే ఆనందాన్ని అందుకుంటారు. పోటీలందు ప్రణాళికా పరంగా పాల్గొనండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక శక్తికి అదృష్టం తోడవనుంది. పరిశీలనాత్మకతతో పనులను పూర్తి చేయండి. మిత్రులు సాయపడతారు. వదంతులు నమ్మకండి. నిబ్బరంగా, నైపుణ్యంతో కార్యాలు పూర్తి చేయండి. స్ర్తిల విషయాలందు తొందర నిర్ణయాలు వద్దు. బంధుమిత్రుల విషయాదులు ఇబ్బందికరంగా ఉండకుండా మెళకువ పాటించండి. స్పెక్యులేషన్ జయప్రదం. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆరంభంలో ఆదాయం కనిపించకపోయినా పైకం సర్దుబాటవుతుంది. వెసులుబాటుతనంతో ముందుకెళ్తారు. చేపట్టే వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యాలు ఆలోచింపజేస్తాయి. ఇతరులు మీ పనులకు అడ్డు తగలకుండా జాగ్రత్త వహించాలి. దంపతులు సమష్టిగా కొన్ని ముఖ్య కార్యక్రమాలు మీ మార్గదర్శకత్వంతో నిర్వర్తించి మన్ననలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్ర్తిలు బహుమతులు అందుకుంటారు. పెట్టుబడులు ఆలోచనకు వ్యతిరేకంగా నిర్వహించకండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అందరూ మిమ్మల్ని గమనించే కాలం. శక్తికి మించి శ్రమించకండి. హితుల ఆలోచనలు మీకు ఉపయోగపడతాయి. ఫలప్రదమైన, యోగప్రదమైన సమయం. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, సాంకేతిక, విద్యా రంగాలందు వృద్ధిని చూస్తారు. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ముఖ్యమైన పత్రాలు, విలువైన ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బకాయి పనులు పూర్తి చేస్తారు.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855