S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రిటర్న్ గిఫ్ట్ (మాతో-మీరు)

‘సండే గీత’ రిటర్న్ గిఫ్ట్ పరంగా చెప్పిన విషయాలు అలరించాయి. నిజమే. తమ వద్ద పండేది ఇతరులకు పంచాలి! కోతిలోంచి మనిషి పుట్టాడంటారు. కాని మనిషి ఊబకాయం కోతికి సంక్రమించడం, ఆ ఊబకాయాన్ని తగ్గించడానికి దాన్ని పరిగెత్తించడం భలే తమాషాగా అనిపించింది. అక్షరాలోచనల్లో ‘తంపటి’ కవిత ఆలోచింపజేసింది. సర్దుకుపోవడం సరైన పద్ధతి కాదు. తప్పును సమర్థించడమే అనడం సరికాదేమో. సర్దుకుపోయే లక్షణం లేనందునే రావణ దుర్యోధనాదులు అంతిమంగా నిజ సౌఖ్యం పొందలేక పోయారు కదా. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవడమే నిజమైన బలం!
-ఎన్.గిరిధర్ (కాకినాడ)
వాట్సాప్ గ్రూప్
వాట్సాప్ గ్రూప్ గురించి ఓ చిన్న మాటగా చక్కగా చెప్పారు. అయితే వాట్సాప్ వల్ల అనర్థాలూ ఉన్నాయి. అసత్య పోస్టింగ్‌లు, స్వోత్కర్ష, పరనింద లాంటివీ పెచ్చరిల్లుతూ ఉంటాయి. వంద అడుగుల ఎత్తున 300 టన్నుల ఇనుముతో నిర్మించిన జోడు గుర్రాల శిల్పం ఆకట్టుకుంది. వారసత్వ సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటాం. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అయితే సంతోషిస్తాం. కాని నేత కొడుకు నేత అయితే వారసత్వాన్ని నిందిస్తాం. వారసుడికి ఓటు వేసి గెలిపించనేల? నిందించనేల?
-బి.ప్రభాస్ (గాంధీనగర్)
కామధేనువు
గోవు మానవాళికి కామధేనువు. దాని శరీరంలోని ప్రతి భాగం పూజనీయమే - అంటూ గోవు ప్రాముఖ్యం, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత గురించి చక్కగా వివరించారు ‘గోవేదన’ కవర్‌స్టోరీలో. చాలా చక్కని వ్యాసం. తెలుగు సినిమాల్లో బాహుబలికి తప్ప ఏ సినిమా స్వీకెలూ హిట్ అవలేదు. కాని గోపాలంగారి ‘ఖయాలో మేఁ’ సీక్వెల్ చాలా బాగా నచ్చింది. ఏం పాడుతున్నాడో తెలియకుండా పాటను మింగేసే లాగ వాద్యఘోష ఉండరాదంటూ లయ జ్ఞానంతోనే ధ్వని మాధుర్యం పెల్లుబికే ఆవశ్యకతను ‘అమృతవర్షిణి’లో బాగా వివరించారు. నర్సరీ రూంలోని మంచి పిల్ల దెయ్యాల కథ ఆసక్తికరంగా ఉంది.
-శాండోప్రచండ్ (శ్రీనగర్)
మాగ్నెటిక్ హిల్
కార్గిల్ - శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలోని మాగ్నెటిక్ హిల్ విశేషాలు ఆకట్టుకొన్నాయి. నిజమే. సృష్టిలోని వింతలు అన్నీ ఇన్నీ కావు. డెబ్బై సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా మసీదుకి వెళ్లిన హసన్ దేవుడన్ని చోట్లా ఉన్నాడని గ్రహించి మసీదుకి వెళ్లడం మానేశాడు. దేవుడు ఇక్కడ కూడా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మసీదుకే ఎందుకు వెళ్లాలన్న అతని ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. ‘కథాసాగరం’లోని ఈ కథ మాకు బాగా నచ్చింది. అతి తీపి కేన్సర్ కారకం అని ‘మీకు మీరే డాక్టర్’ ద్వారా తెలుసుకున్నాం. మంచి ఉపయుక్త విషయాలు ఈ శీర్షికలో ఇస్తున్నందుకు ధన్యవాదాలు.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)
ఏదీ ఆ మాధుర్యం?
పాడే పాటలోని సాహిత్యం శ్రోతలకు బాగా అర్థమవ్వాలి. మాటలు సరళంగా ఉండి సుబోధకంగా ఉండాలి. ఏం పాడుతున్నాడో తెలియకుండా పాటను మింగేసేలా వాద్యఘోష ఉండకూడదు. ఇది మల్లాది వారి భావనే కాదు. సంగీత సాహిత్యాలను విని ఆస్వాదించేవారందరిదీనూ. ఇది ఒక్క సంగీత కచేరీలకు లేక ఇతర సంగీత విద్వాంసులకే కాదు. చిత్రసీమకు కూడా వర్తిస్తుంది. అలనాటి సినిమాలలోని పాటలు సంగీత విభావరులుగా వెల్లివిరిసేవి. సంగీత దర్శకులు కూడా సాహిత్యానికి పెద్దపీట వేసి తమ సంగీతం కేవలం అతి తక్కువ వాద్యాలతో వరుసలు కూర్చి పాటలను ఉర్రూతలూగించేవారు. ఈ పద్ధతికి శుద్ధ వ్యతిరేకం నేటి పరిస్థితి. ‘అమృతవర్షిణి’ వంటి కథనాలను సినీ సంగీత దర్శకులు కూడా చదవాలి. మార్పు చెందాలి. లయజ్ఞానంతోనే ధ్వని మాధుర్యం అని తెలుసుకోవాలి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
లాలిపాట
మా కావలితో శ్రీ ద్వారం వారికి ఎంతో అనుబంధం. వారికి మా కళాశాల సన్మానం చేశారు. ఆ సందర్భంగా నాయుడుగారు ‘నా వయోలిన్‌తో కృతజ్ఞతలు చెప్పడం తప్ప నాకు ఏం చేతనవును?’ అని, ‘జో అచ్యుతానంద, జోజో ముకుంద’ అన్న లాలిపాటను తమ ఫిడేల్ కమాన్ మీద వాయించారు. ప్రేక్షకుల చప్పట్ల జల్లులు. ద్వారం వారి అభిమాన పుత్రులు ద్వారం భావనారాయణ గారు కూడా కావలి కాలేజీలో సంగీత శాస్త్ధ్రాపతిగా పని చేయటం మా కావలి చేసుకున్న అదృష్టం.
-ప్రొ.కె.ఎన్.రావు (కావలి)
లక్షణం
అతి వేగం చావు లక్షణం అన్న సూక్తి ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా వినిపిస్తోంది. మితిమీరిన వేగం, నడిపే వాహనంపై లేని అవగాహన, త్వరగా చేరుకోవాలన్న అనవసరపు తపన, యవ్వనంలో బుద్ధిపై లేని అదుపు - ఇవన్నీ జరిగే ఘోర ప్రమాదానికి కారణాలని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఐతే - మితిమీరిన వేగాన్ని అదుపు చేయటం మాత్రం జరగటంలేదు. ప్రమాదాలూ, వాటి వివరాలను గురించి ఎంతో చక్కగా వివరించారు. ‘జ్ఞాపకాల పుప్పొడిని మనసులో రేపి’ చక్కని అనుభూతిని అందించింది జగదీశ్ కవిత. పాడటంలోనూ, పాటకు శిక్షణ ఇవ్వటంలోనూ కాక, సంగీతాంబుధిని అనే్వషించి విలువైన జ్ఞాపక రత్నాలను అందజేస్తున్న సూరిబాబు గారికి ధన్యవాదాలు. ‘టెలీపతి’ని గురించి ‘నమ్మండి ఇది నిజం’లో చక్కగా తెలియజేశారు.
-డా.శివభూషణం (కర్నూలు)
గోవేదన
‘గోవేదన’ కవర్‌స్టోరీ బాగుంది. ఆవును ‘జాతీయ జంతువు’గా గుర్తించి ప్రభుత్వాలు మంచి నిర్ణయాన్ని తీసుకోవడం మనకెంతో గర్వకారణం. ‘సండే గీత’లో రిటర్న్ గిఫ్ట్ గూర్చి చక్కగా తెలియజేశారు. ఖరీదు తక్కువైనా గాని అది ఇచ్చిన స్ఫూర్తి మాత్రం వెలకట్టలేనిదని జింబోగారు చక్కగా తెలియజేశారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)