S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( జులై 2 నుండి 8 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు. త్వరితగతి నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు. స్ర్తిలు సమస్యలను లౌక్యంతో పరిష్కరించుకొంటారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. శత్రువులు మిత్రులవుతారు. కొత్త పరిచయాలు ప్రయోజనకరం. స్వవిషయాలు, చర్చలు ఇబ్బందికరం. పెట్టుబడి ఆకర్షణీయం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక వెసులుబాటు. మిత్రులు సాయపడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగులు, వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. ధన లాభం, వస్తు లాభం. ప్రణాళిక మేరకు పనులు పూర్తి చేస్తారు. నిరాశను దరికి రానీయకండి. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు ఫలప్రదం. స్పెక్యులేషన్ దీర్ఘకాల ఫలాలను ఇస్తుంది. కుటుంబ సభ్యుల కదలికలను గమనించడం మంచిది. పైక వ్యవహారాలలో తలనొప్పి లేకుండా చూసుకోండి. ముఖ్యులకు మీ సాయం కావలసి వస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

వృధాగా సమయాన్ని వెళ్లబుచ్చకండి. సమయపాలన మంచిది. పైకం సమయానికి అందుతుంది. అప్పులు ఇవ్వకండి. తీసుకోకండి. మీ మనసులోని విషయాలను లౌక్యంగా తెలపండి. శుభవార్తలు వింటారు. విద్య, వైద్య, వృత్తి, ఉద్యోగాలలో గుర్తింపును అందుకుంటారు. స్పెక్యులేషన్ మిశ్రమం. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఈర్ష్య పడకండి. దంపతులకు, స్ర్తిలకు ఆర్థిక ప్రాప్తి. వ్యతిరేకంగా పనులు చేయవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ధి. అనుకోని మార్పులు సంతోషకరం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

నిర్ణయాలకు అనుకూలంగా వెళ్లండి. అరకొర విషయాలందు ఆసక్తి వద్దు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తాయి. మీ ఉద్యోగ, వృత్తి, వ్యాపార, వ్యవహారాలు మెరుగవుతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉండండి. అనుకోని ప్రయాణాలు ఇబ్బందులకు గురి చేస్తాయో ఆలోచించుకోండి. ఆర్థిక నిర్ణయాలు మెల్లగా వృద్ధి పొందుతాయి. వదంతులను నమ్మవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఆర్థిక ప్రగతి. అదృష్ట యోగం. మీ బంధు మిత్రులు సంతోషాన్ని అందిస్తారు. ఇతరుల విషయంలో తలదూర్చకండి. వ్యాపార విస్తరణకు మేలు. ఉద్యోగ మార్పులు. వృత్తి విస్తరణ. అదనపు బాధ్యతలుంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకొంటారు. పైకం వెంటనే రాకున్నా సమయానికి సర్దుబాటవుతుంది. స్పెక్యులేషన్ జయప్రదం. శుభవార్తలు వింటారు. వదంతులు నమ్మకండి. అన్నింటా జయం, శుభకరం.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మీ యత్నాల వల్ల అందరికీ అనుకున్న విధంగా సాయపడతారు. మీ తాహతుకు మించిన పనులు చేయకండి. ఆరోగ్యం పదిలం. వస్తు, వస్త్ర కొనుగోలు, మార్పులకు అవకాశాలు. మిత్రులతో కలిసి ప్రయాణాలుంటాయి. అనుకోని ప్రయోజనాలు అందుకుంటారు. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. స్పెక్యులేషన్ మిశ్రమం.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఆచితూచి అన్నింటా అడుగు వేయటం మంచిది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక ఫలాలు, పెట్టుబడులపై రాబడి బాగుంటుంది. మంచి పనులకై పథకాలు వేస్తారు. హితుల సాయంతో అన్నీ సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలున్నప్పటికీ ఇబ్బందికరంగా ఉండవు. ఆందోళన తగ్గించుకోండి. స్పెక్యులేషన్ మిశ్రమం. కోర్టు, విదేశీ వ్యవహారాలు పరిష్కరించుకొంటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఐచ్ఛికంగా పనులు మెల్లిగా పూర్తి చేయవలసి వస్తుంది. సమయానికి విలువ ఇవ్వండి. అనారోగ్యాన్ని దరికి రానీయకండి. అనుకోని ప్రయాణాలున్నాయి. మిత్రుల సలహాలు పాటించినా నిర్ణయాలు మీవే. బంధుమిత్రులతో కలిసి కార్యక్రమాలందు ప్రణాళికలు వృద్ధి బాటన ఉంటాయి. స్పెక్యులేషన్ ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, వ్యవహారాలు తృప్తినిస్తాయి. వదంతులు నమ్మకండి. అన్నింటా జయం, శుభకరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

లౌక్యంతో అన్ని పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. ఎవరినీ నొప్పించకుండా మీ పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు సమీక్షించండి. స్పెక్యులేషన్ శుభప్రదం. స్తల్రు మంచి వార్తలు వింటారు. ధన ప్రాప్తి. వస్తు ప్రాప్తి. ఆనంద లబ్ధి. స్ర్తిలు ఉద్యోగాలు పొందుతారు. పెట్టుబడి వ్యూహాత్మకంగా మార్పు చేసుకోండి. మిత్రుల సాయం మరువలేనిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. పట్టుదల, ఓర్పులతో కొత్త సాంకేతిక పనులందు నేర్పును ప్రదర్శిస్తారు. వాహన ప్రాప్తి. సౌఖ్యం. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు, మార్పులు. వ్యాపార విస్తరణ. వృత్తి రంగంలో అదనపు బాధ్యతలు అందుకుంటారు. దంపతులకు, స్ర్తిలకు ఆర్థిక ప్రాప్తి. వ్యతిరేకంగా పనులు చేయవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ధి. అనుకోని మార్పులు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

అనుకున్నట్లుగానే పైకం అందుతుంది. కలయికతో కలతలు లేకుండా వ్యవహరిస్తే అంతా జయం. మంచి వార్తలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాలు మీ కనుసన్నలలో ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. చేసే పనులందు ప్రశంసలు అందుకుంటారు. మాట నేర్పు మంచిది. వివాదప్రదమైన విషయాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ఫలాలను అందిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

పనులు పూర్తి చేస్తారు. మీ వ్యవహారాలలో అడ్డు తగిలే వారున్నారు. జాగ్రత్త వహించండి. గమనిస్తూ ఉండండి. ఆర్థిక ఉన్నతి. లావాదేవీలు ఫరవాలేదనిపిస్తుంది. శత్రుత్వం తగ్గి, మిత్రత్వం మెరుగవుతుంది. అనుకున్నది ఒకటి జరిగే మరొకటి అన్నట్లుంటుంది. మీ ఆలోచనలకు పదును పెట్టండి. తెలివిగా ప్రవర్తించండి. పెట్టుబడులు సంశయంతో వద్దు.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855