S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తలపుల పందిరి

తలపుల పందిరి కింద మాటల గడబిడ గురించి చక్కగా వివరించారు ‘లోకాభిరామమ్’ గోపాలంగారు. ప్రాంతాల పేరుతో వాడుకలో ఉన్న అనేక వంటకాలు, కాయలు, పళ్లు నిజానికి ఆ ప్రాంతంలో దొరక్కపోవచ్చు. మైదాతో బూరెల్లాగ తయారుచేసే మైసూర్ బోండా అసలు మైసూర్‌లో దొరకదు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా తిరుమల స్వామి సన్నిధిలో రోజంతా ఉండేందుకు ఒక్కరోజు గవర్నర్ పదవి కావాలనడం తమాషాగా ఉంది. కాని అలా రోజంతా విదులు నిర్వహించకుండా కూచోడం అధికార దుర్వినియోగమే! విమానాన్ని చూడకుండా దాని నంబర్ చెప్పి అది తమ ఇంటి మీద కూలిపోతుందని ముందుగానే ఒక గర్భిణి చెప్పడం అద్భుతమైన నమ్మలేని నిజం!
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
నీతి
కుక్క అనగానే విశ్వాసంగల జంతువు అనేస్తాం. కాని క్షణక్షణానికి దాని దృష్టి చెదిరిపోయి అటు ఇటు పరిగెత్తి వస్తుంది. మనం జీవితంలో కుక్కలా చంచలంగా ప్రవర్తించరాదన్న నీతి ‘ఓ చిన్న మాట’గా చెప్పడం బాగుంది. జీతంగా ఒక్క రూపాయి తీసుకునే మంత్రులకు అసలు జీతం ఎందుకు? వారికి జీతం కంటే ‘గీతం’ ఎక్కువ! సోషల్ మీడియా స్వేచ్ఛ గురించి ఒకరు వాపోయారు. స్వేచ్ఛ పేరుతో జయలలిత మరణం కన్నా ముందే ఆమెను చంపేశారు. ఒక యాక్సిడెంట్‌లో రామ్‌దేవ్ బాబాని చంపేశారు. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం గురించి అసత్యాలు! స్వేచ్ఛకీ హద్దులు, బాధ్యతలూ ఉంటాయి. హద్దు మీరితే శిక్ష అవసరమే.
-ఎ.శాంతిసమీర (వాకలపూడి)
విజయం
అక్కరలేని విషయాలను వదిలేసి, దృష్టి చెదరనీయకుండా, ఏకాగ్రత, క్రమశిక్షణలతో పనిచేస్తేనే విజయం సాధ్యమన్న చక్కని సందేశాన్ని ‘ఓ చిన్న మాట’ ద్వారా తెలియజేసిన అంశం హృదయాల్ని హత్తుకునేలా ఉంది. అమృతవర్షిణి శీర్షికలో నాదబ్రహ్మ త్యాగయ్య క్రమశిక్షణ, సాధనా పద్ధతులు, ఆయన శిష్య, ప్రశిష్య పరంపర గురించి అమూల్యమైన విషయాలను అందిస్తున్న మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలు. త్యాగయ్య సృష్టించిన ఇరవై నాలుగు వేల అమూల్య కీర్తనలలో కేవలం కొన్ని వందలు మాత్రం లభ్యం కావడం మన దురదృష్టం. ఉప్మా ఆనందం కథ సరదాగా సాగింది. మల్లాదిగారి ‘అన్నిటా సమర్థుడు’ క్రైం కథ వైవిధ్యభరితంగా ఉంది. ఆయన రచనలు ఇప్పటికి రెండు దశాబ్దాల నుండి క్రమం తప్పకుండా చదువుతున్నాను. ఇప్పటికీ శైలిలో విశిష్టత, తెలుగు పదాలు వాడే విధానం, రచనలో వేగం, ఊహకందని మలుపులు వంటి అంశాలలో ఏ మాత్రం మార్పు లేదు. పాత్రల పేర్లు, ప్రదేశాలను మినహాయిస్తే తెలుగు నేటివిటీకి సరిపోయేలా అనువాద కథలను అందించడంలో మల్లాది గారిది ఒక ప్రత్యేకమైన శైలి.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
ప్లాస్టిక్
ప్లాస్టిక్ బియ్యం మన దేశాన్ని గడగడ లాడిస్తున్నది. కవర్‌స్టోరీలో దీని గురించి విపులంగా వివరించినా సామాజిక మాధ్యమాలు హడలగొడుతున్నాయి. ఒక మిషన్‌లో ప్లాస్టిక్ చెత్త వేస్తే అది తాడులా తయారై మరో మిషన్‌లో తునాతునకలై బియ్యంలాగ కనిపించడం వాట్సాప్‌లో చూశాం. అవి బియ్యం కాదు. ప్లాస్టిక్ పెల్లెట్స్. ఇవి బియ్యం కంటే తేలిక. బియ్యం కంటే ఖరీదైనవి. దీన్ని బియ్యంలాగ అమ్మడం లాభసాటి కాదు. బియ్యం సంగతలా ఉంచితే పళ్లు, కూరగాయలు, కూల్‌డ్రింక్స్ అన్నింటా హానికర రసాయనాలున్నాయి. దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యమే.
-కె.సుధీర్ (శ్రీనగర్)
సండే గీత
ఒకప్పుడు ఎవరి గురించైనా తెలియాలంటే వారి ఫ్రెండ్స్, చదివే పుస్తకాల గురించి తెలిస్తే చాలు. ఇప్పుడు వారు చూసే వెబ్‌సైట్స్, యూట్యూబ్‌లోని వీడియోలు గురించి తెలిస్తే చాలన్న ‘సండే గీత’ చాలా బాగుంది. ‘అవీ ఇవీ’లో వృశ్చిక నారి, బంతుల కొలను ఆకర్షించాయి. ఐఐటి విద్యావంతులు గోమాంస ముక్కలు చీకుతూ నిరసన తెలపడం బుద్ధిలేని పని అని మీరు ధైర్యంగా చెప్పిన సమాధానం భేష్. క్రీడాకారులకు ఉద్యోగాలివ్వడం వల్ల ఎవరి ఉద్యోగాలూ పోవు. అవి ప్రత్యేకంగా సృష్టించే పోస్టులు. వాళ్లు రోజూ ఆఫీసుకి వెళ్లి పని చేయనక్కర్లేదు. అంత గొప్ప వ్యక్తి మా కొలువులో ఉన్నారని ఘనంగా చెప్పుకోడానికే ఆ పోస్టులు.
-డి.అభిలాష (సాంబమూర్తినగర్)
భాయ్‌భాయ్
గోపాలంగారు చైనా గురించి చెప్పిన గొప్పలు ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు చైనీయులు పట్టు, తుపాకి మందు, కాగితం ప్రపంచానికి పరిచయం చేసి ఉండొచ్చు. కాని ఇప్పుడు మాత్రం హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూనే చేసిన ద్రోహం, పాకిస్తాన్ పక్కన చేరి ఉగ్రవాదుల్ని రక్షిస్తున్న వైనమే కనిపిస్తున్నాయి. నమ్మండి ఇది నిజం అంటూ సంధించిన చిక్కు ప్రశ్న మమ్మల్ని తికమకపెట్టింది. ఒకరి అంతిమ శ్వాస ఇంకొకరి తొలి శ్వాస అవుతుందని రంజిత్, బెడెక్‌గా పుట్టాడని చెప్పడం బాగానే ఉంది. కాని విన్నవాళ్లు ఇది నిజమా అని తికమకపడటం సహజమే. ఇలాంటి భావనలు మన దేశంలోనే కాక విదేశాల్లో ఉండటం ఆశ్చర్యమే.
-ఆర్.మరుదకాశి (కరప)
స్ఫూర్తి
నక్కలా ఉండాలా? పులిలాగ బతకాలా? అని ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి. పులిలా జీవించడానికి ప్రయత్నించాలి. కాళ్లు విరిగిన నక్కలా కాదని చెప్పిన ‘ఓ చిన్న మాట’ స్ఫూర్తిదాయకంగా ఉంది. కాకినాడ నివాసి ఒకరు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ని తెదేపా వాడుకోడాన్ని ప్రశ్నించారు. కాకినాడలోనే మున్సిపల్ స్కూల్ పక్క గ్రౌండ్‌ని ప్రతి ఏటా క్రైస్తవ కూటములు, ఎగ్జిబిషన్‌ల కోసం వాడుతూ ఉంటే ఆయనెందుకు ప్రశ్నించరు? శుద్ధమైన సంగీతం గురించి మాట్లాడినా, పాడి వినిపించినా వినాలని ఆసక్తి లేని వారివల్ల సంగీతానికి పట్టిన దుర్గతిని చక్కగా వివరించారు అమృతవర్షిణిలో.
-ఎ.చైతన్య (వాకలపూడి)