S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (జులై 9 నుండి 15 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక వృద్ధి. అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు తృప్తినిస్తాయి. అనుకోకుండా వస్తువులు తారుమారయ్యేట్లు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వల్ల శుభవార్తలు వింటారు. గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. కొత్త పరిచయాదులు ఆలోచింపజేస్తాయి. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. స్ర్తి ఆధిక్యతతో పనులు సాఫీగా జరుగుతాయి. స్ర్తిల ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు మంచి అవకాశాలు. సామాన్యం అసామాన్యం అవుతుందా అని ఆలోచించాలి. ఆత్మీయులు కలిసి వస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

పరిస్థితులు అనుకూలం. ఆదాయానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకోని మార్పులు, బదిలీలకు అవకాశాలు. లోగడ నిలిచిన కార్యాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు సౌఖ్యం. జీవన లాభం. నిరుద్యోగులకు శ్రమపై ఉద్యోగావకాశాలు. సంఘంలో ఉన్నత స్థితి. భార్యాభర్తల మధ్య అవగాహన మెరుగవుతుంది. ప్రయాణ లాభాలు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రులు శత్రువులు కాకుండా చూసుకోండి. మంచి వార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అర్ధలాభం. శ్రేయోదాయకం. ఆస్తి విలువ వృద్ధి. తోటివారి సహకారం ఉంది. సమస్యలు సృష్టించే వారితో అప్రమత్తంగా ఉండండి. వృత్తి, వ్యాపార, వ్యవహారాలు ఫలవంతమవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం. ఆరోగ్యం జాగ్రత్త. పెట్టుబడి మధ్యస్థంగా ఉంటుంది. స్ర్తిలు, దంపతులు అనుకున్నవి అందుకుంటారు. సున్నిత అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనులలో ఆటంకాలున్నా లౌక్యంతో పూర్తి చేస్తారు. ఏకాగ్రత, సమగ్రతత్వమే మేలు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆలస్యంగానైనా పనులు అనుకున్నవి నిర్వహిస్తారు. ఆవేశాలకు దూరంగా ఉండండి. ఎదుటి వారు పరిశీలనాత్మకంగా మెలగుతున్నారు. గమనించండి. మాటలు ఇబ్బందికరం కారాదు. సామాజిక సంబంధాలు బలపడతాయి. చేపట్టే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ రంగాలు గత వారం కంటె మెరుగవుతాయి. తొందరలో నిర్ణయాలు తీసుకోకండి. పరిధిని దాటకండి. సమస్యలకు వారధి కట్టండి. మొగమాటాలు వద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక ప్రగతి ఉంది. ఆశించినవి అందుకుంటారు. సమిష్టిగా పనులు పూర్తి చేయనున్నారు. అధికారుల మన్ననలు పొందుతారు. హితులు సన్నిహితులవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలందు అభివృద్ధి. స్పెక్యులేషన్‌లో తృప్తి. మిత్రులు మీ సాయం ఆశిస్తారు. లాభపడతారు. సున్నిత అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనులలో ఆటంకాలున్నా లౌక్యంతో పూర్తి చేస్తారు. ఏకాగ్రత, సమగ్రతత్వమే మేలు. అనుకోని ప్రయాణాలు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

మీరు అనుకున్నది పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అనుకోని వ్యయాలు. ప్రణాళికల మేరకు ప్రవర్తించండి. ఆరోగ్య మెళకువలు పాటించండి. స్ర్తిలకు మంచి సమయం. వస్తు, వస్త్ర లబ్ధి. ఆవేశం వద్దు. విలువైన సమాచారం లాభాలను అందిస్తుంది. సంతాన ప్రాప్తి. సౌఖ్యం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అన్నింటా శుభకరం. ఇతరుల సాయం తీసుకోవాల్సి వస్తుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

సకాలంలో పైకం అందుతుంది. కార్యాలు ఆలస్యంగానైనా పూర్తవుతాయి. బుద్ధిబలం మీకు అండగా నిలుస్తుంది. సంతోష కాలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు అనుకున్నట్లుగా ఉంటాయి. హితుల సాయంతో పనులు సునాయాసంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఖర్చుకు కళ్లెం వేయాలి. స్పెక్యులేషన్ ఫలదాయకం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అన్నింటా శుభకరం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక ప్రయత్నాలు తృప్తినిస్తాయి. అనుకోని పైకం అందేట్లుంది. స్ర్తిలకు అనుకోని ప్రయాణాలు. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. ఐచ్ఛికంగా కొన్ని పనులు ఇతరుల సాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు అందరి దృష్టిలో ఉండేట్లు ఉన్నాయి. స్పెక్యులేషన్ ఫలవంతం. ఆటంకాలున్నాయి. వారం వారం ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగులకు స్థాన మార్పు. దంపతులు అరమరికలు లేకుండా మసలాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆర్థిక విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అకాల భోజనం వద్దు. హద్దులు దాటి వెళ్లకండి. శత్రుత్వం మిత్రత్వమవుతుంది. మీ మార్గదర్శకత ఇతరులకు యోగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్న కార్యాలు నత్తనడకన ఉంటాయి. స్పెక్యులేషన్‌లో జయం. ముఖ్యమైన వార్త సంతోషాన్ని పెంచుతుంది. పంచుతుంది. సామాన్యం అసామాన్యం అవుతుందా అని ఆలోచించాలి. ఆత్మీయులు కలిసి వస్తారు. సమస్యలకు వారధి కట్టండి. మొగమాటాలు వద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

సకాల కార్యసిద్ధి. కుటుంబ విషయాలపై శ్రద్ధ అవసరం. ఆదాయ వ్యయాలు లక్ష్యాలకు అనుకూలం. సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రశంసలు అందుకుంటారు. చేపట్టే వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహార చర్యలు ఫలప్రదం అవుతాయి. దంపతులు సంయమనం పాటిస్తే మంచిది. స్ర్తిల ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు మంచి అవకాశాలు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఖర్చు, రాబడి మధ్య పొంతన తగ్గేట్లుంది. ఓ విధంగా అనుకుంటే మరో విధంగా ఉంటుంది. వస్తు లాభం అందుకుంటారు. స్వల్ప బహుమతులు ఆహ్లాదాన్ని పెంచుతాయి. కుటుంబంలో సహకారం పెరుగుతుంది. అన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి మీ చొరవతో. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు గతం కంటె మంచి మార్గాన నడుస్తాయి. గుర్తింపును పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. స్పెక్యులేషన్ మిశ్రమం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయ వ్యయాలు ఫరవాలేదనిపిస్తాయి. పనులు మెల్లగా పూర్తి చేస్తారు. పరిచయస్తులతో సంతోషంగా గడుపుతారు. అన్నింటా అప్రమత్తత మంచిది. వృత్తి, వ్యాపార వ్యవహారాలు గుర్తింపునిస్తాయి. ఉద్యోగులకు స్థాన మార్పు. దంపతులు అరమరికలు లేకుండా మసలాలి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అన్నింటా శుభకరం. ఇతరుల సాయం తీసుకోవాల్సి వస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855