S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ సాలీడును ‘బ్లాక్ విడో’ అంటారెందుకు?

నల్లగా, ఎర్రటి మచ్చలతో కనిపించే ఈ సాలీళ్లను ‘బ్లాక్ విడో స్పైడర్’గా పిలుస్తారు. ఉత్తర అమెరికాలోని అలస్కా మినహా అన్నిచోట్లా ఇవి కనిపిస్తాయి. సాలీళ్ల జాతిలో అతి ధృడమైన దారాన్ని అల్లుకునేవి ఇవే. చక్కటి గూడును అల్లుకున్న ఆడసాలీడుతో జతగట్టేందుకు మగసాలీళ్లు వేచిచూస్తాయి. నచ్చిన మగసాలీడుతో జతకట్టిన వెంటనే ఆడసాలీళ్లు మగవాటిని చంపి తినేస్తాయి. అందువల్లే వాటికి ‘బ్లాక్ విడోస్’ అన్న పేరు వచ్చింది. పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించేందుకే అవి అలా చేస్తాయని అధ్యయనాల్లో తేలింది. జతకట్టడానికి ముందే ఆడసాలీళ్లు ఆహారాన్ని తిని ఉంటే ఇవి బతికిపోయినట్లే. అందుకే జతకట్టేముందు ఆడసాలీళ్లు తిన్నాయోలేదో గమనించే శక్తి మగసాలీళ్లకు ఉంది. ఏమరుపాటుతో వ్యవహరిస్తే అంతేసంగతులు. వీటి విషం చాలా ప్రమాదకరమైనది. అందులో ఉండే లెరోటాక్సిన్ ప్రాణాంతకం. రేటిల్‌స్నేక్ విషానికన్నా దీని విషం పదిహేనురెట్లు ప్రభావం చూపుతుంది. అయితే వీటి విషానికి విరుగుడు మందులు పుష్కలంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రమాదం తప్పుతోంది. ఇవి పది మిల్లీమీటర్లకన్నా పెరగవు. ఇతర సాలీళ్లు గూళ్లలో చిక్కుకున్న క్రిమికీటకాలను పీల్చిపిప్పి చేస్తాయి. కానీ బ్లాక్ విడోస్ తీరు వేరు. గూళ్లలో చిక్కుక్కున్నవాటి శరీరంలోకి ఒకరకమైన ఎంజైమ్‌ను ఇంజెక్ట్ చేసి, అవి మెత్తబడగానే జుర్రేస్తాయన్నమాట.

- ఎస్.కె.కె. రవళి