S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘బెర్రీ పళ్ల’తో ఆడుకుంటాయెందుకు?

వాక్స్‌వింగ్ పక్షుల్లో ‘బెహమిన్ వాక్స్‌వింగ్’ పక్షులది ప్రత్యేక శైలి. తోక, రెక్కల చివర్లలో ఉండే ఎర్రటి మెత్తటి గుర్తుల వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. ప్రాచీన కాలంలో ఉత్తరాలు, కవర్లకు వేసే ఎర్రటి సీల్‌కు వాడే మైనాన్ని పోలినట్లు వీటి గుర్తులు ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. బెర్రీ పళ్లంటే ఈ పక్షులకు ఇష్టం. జతకట్టే ఆడమగ పక్షులు పరస్పరం బెర్రీ పళ్లను బహుమతిగా ఇచ్చుకుంటాయి. ఒక పండును పరస్పరం అందించుకునేందుకు ప్రయత్నిస్తాయి. బెర్రీని మగపక్షి ఆడపక్షి చెంతకు నెడితే, దానిని ఆడపక్షి తిరిగి మగపక్షి చెంతకు తోస్తుంది. మన పెళ్లిలో వధూవరులు పూలబంతులాట ఆడినట్లన్నమాట. వాటిమధ్య సాన్నిహిత్యం, ప్రేమ, అనుబంధం అల్లుకోవడానికి ఈ ఆట ఉపకరిస్తుందన్నది జీవశాస్తవ్రేత్తల అంచనా.

- ఎస్.కె.కె. రవళి