S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హిప్నొటైజ్

ఆర్నాల్డ్ వృత్తి నైట్ క్లబ్స్‌లో హిప్నాటిజం వినోదాన్ని అందించడం. అతను ఎవర్నైనా హిప్నొటైజ్ చేయగలడు. బ్రిటన్‌లోని కన్నింగ్‌హేమ్‌లో ఓ పార్టీలో కొందరు అతిథుల ముందు అతను ఛెరిల్ని హిప్నొటైజ్ చేశాడు.
‘నీ కనురెప్పలు బరువెక్కాయి... నీ చేతులు బరువుగా వున్నాయి.. నీ శరీరం అంతా బరువుగా ఉంది.. నువ్వు గాఢనిద్రలోకి వెళ్తున్నావు’ అనే అతని మాటలని వింటూ ఛెరిల్ ‘నేను నిద్రపోను’ అని మనసులో అనుకుంది. ఐనా వద్దనుకున్నా కనురెప్పలు బరువుగా మూసుకున్నాయి. ప్రయత్నించినా ఆమె వాటిని తెరవలేక పోయింది. హిప్నటైజైన ఆమె అతని ఆజ్ఞల ప్రకారం మంచినీళ్లు తాగడం, పుస్తకం చదవడం, ఉత్తరం టైప్ చేయడం లాంటివి, ఆ వస్తువులు లేకపోయినా అలా ఉన్నట్లుగా చేసింది.
అతిథులకి ఇచ్చే వినోదం పూర్తయ్యాక ఆర్నాల్డ్ హిప్నొసిస్ లోంచి బయటకి తీసుకువచ్చాడు.
‘హిప్నటైజ్ కాకుండా చాలా పోరాడారు కదా?’ ఆ పార్టీకి వచ్చిన మేరన్ ఆమెని నవ్వుతూ అడిగాడు.
‘మీకెలా తెలుసు?’
‘నాకు హిప్నొసిస్ గురించి కొంత తెలుసు. హిప్నొసిస్‌లో ఉన్న వారిలో టెలీపతి శక్తి పదునెక్కుతుంది. మీరూ నేను ఒకే వేవ్‌లెంగ్త్‌లో ఉన్నాం కాబట్టి నాకు మీ ఆలోచనలన్నీ నాకు అందాయి. ‘నేను మీరు చెప్పినట్లు చేయను. నన్ను మీరు తాడుతో కట్టినట్లు కట్టారు’ అని కోపగించుకున్నారు కదా?’
‘అవును. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను?’ ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
‘మీ నిగూఢ ఆలోచనలు భగ్నమయ్యాయని అనుకున్నారు. నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలి అనుకుంటున్నాను... ‘మీరంటే ద్వేషం’ అనే ఆలోచన మీకు కలిగింది కదా?’ అడిగాడు.
అది నిజం. ఆమె మేరన్ని మళ్లీ కొన్ని నెలల దాకా కలవలేదు. అతన్నించి టెలీపథిక్ మెసేజెస్ అందుకున్న భావన కలగసాగింది. మేరన్‌కి అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయి. అతను కోరినా భార్య పౌలా విడాకులు ఇవ్వడం లేదు. ఆమెకి ఏదో కీడు జరగబోతోందన్న భావన ఛెరిల్‌కి తరచు కలగసాగింది. అకస్మాత్తుగా కొన్ని వారాలపాటు ఆ భావాలు ఆగిపోయాయి. తర్వాత కోపం, ద్వేషం, అసూయ లాంటి భావాలు అకస్మాత్తుగా ఆమెలో కారణం లేకుండా కలగసాగాయి. ఆ కారణం ఓ రోజు అనుకోకుండా తెలిసింది.
ఓ కాక్‌టెయిల్ పార్టీలో మళ్లీ మేరన్ని, అతని భార్య పౌలాని కలుసుకుంది. పౌలా మరొకరితో నృత్యం చేస్తూంటే ఛెరిల్లో కోపాన్ని, అసూయ, ద్వేషాలు చెలరేగి ఆమె గుప్పెళ్లు బిగుసుకున్నాయి. మేరన్ వంక చూసింది. గుప్పెళ్లు బిగుసుకున్న అతను తన వంకే అనుమానంగా చూస్తన్నాడు. తమ వేవ్ లెంగ్త్‌లు కలవడంతో ఒకరి ఆలోచనలు మరొకరికి తెలిసిపోయాయని ఛెరిల్ గ్రహించింది.
ఆమె ఈ సంగతి ఎవరికైనా చెప్తే నవ్వుతారని, పిచ్చని కూడా అనుకోవచ్చని చెప్పలేదు. అతని ఆలోచనా వేవ్ లెంగ్త్‌లోంచి బయటపడాలని అనుకుంది. మూడు వారాల తర్వాత ఓ రాత్రి మేరన్ ఆలోచనలు ఆమెకి అందాయి. ఆమె డ్రెస్సింగ్ టేబిల్ ముందు కూర్చుని జుట్టు దువ్వుకుంటూంటే తన ప్రతిబింబం మాయం అయి కారు ముందు అద్దం లోంచి రోడ్ కనపడింది. హెడ్‌లైట్ల వెలుగులో ఆ రోడ్‌ని ఆమె గుర్తుపట్టింది. క్రమంగా ఆ కారు చెట్లలోకి మళ్లింది. కింద నగరం లైట్లు కనిపించాయి. తెల్లటి డ్రెస్‌లో గాలికి ఎగిరే ఓ మహిళ కనిపించింది. ఆమె పౌలా. చేతిలో చిన్న సూట్‌కేస్. ఆమె ఎదురుచూసేది ఆ కారులో వచ్చిన వారి కోసం కాదు, కార్లోని మేరన్ని భయంగా చూసింది. ‘చంపకు మేరన్. చంపకు’ అన్న ఛెరిల్ అరుపులు వినపడ్డట్లుగా అతను ఓసారి తలతిప్పి వెనక్కి చూసి, ఏక్సిలేటర్‌ని నొక్కి ఆమెకి ఢీకొట్టాడు. పౌలా శరీరం కొండ అంచు మీంచి కింద లోయలోకి పడిపోయింది.
‘వెంటనే ఎలిబీ సంపాదించాలి’ అనే మేరన్ ఆలోచన ఆమెకి అందింది.
ఛెరిల్ వెంటనే ఇంకా ఇంటికి రాని తన భర్త ఎలెన్ ఆఫీస్‌కి ఫోన్ చేసి, తన తల పగిలిపోతోందని, వెంటనే రమ్మని చెప్పింది.
* * *
పౌలా మేరన్ వయసు ఇరవై ఎనిమిది. కారు ప్రమాదంలో తొమ్మిది - తొమ్మిదిన్నర మధ్య మరణించింది. వారి ఇంటి సమీపంలోని మార్టన్స్ హిల్ రోడ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మిస్టర్ మేరన్ ఆ సమయంలో తన మిత్రుడి ఇంట్లో ఉన్నానని చెప్పాడు. సాక్షులు లేరు.
ఎలెన్ దినపత్రికలో ఆ వార్తని చదివి భార్యతో ఆశ్చర్యంగా చెప్పాడు.
‘నిన్న నువ్వు చెప్పింది నిజమే. పౌలాని కారు గుద్దింది. నీకు ఎంతకాలం నించి మేరన్ ఆలోచనలు అందుతున్నాయి?’
‘హిప్నాటిస్ట్ ఆర్నాల్డ్ నన్ను పార్టీలో హిప్నటైజ్ చేసినప్పటి నించి. చెప్తే పిచ్చనుకుంటారని భయపడి చెప్పలేదు’
‘ఇది పోలీసులకి చెప్పినా నమ్మరు. ఐనా ప్రయత్నిద్దాం’ చెప్పి అలెన్ రిసీవర్ అందుకున్నాడు.
అరగంట తర్వాత డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఇవిట్ ఛెరిల్ చెప్పింది విన్నాడు.
‘కోర్టులో కేసు నిలబడటానికి మాకు సాక్ష్యాలు కావాలి. మీరు పార్టీలో పౌలాతో చూసిన వ్యక్తి ఎవరు?’ అడిగాడు.
‘నాకు తెలీదు. అంతకు మునుపు ఎన్నడూ చూడలేదు. నేను మేరన్ మీద మీకు ఫిర్యాదు చేసానని తెలిస్తే అతను...’ వెంటనే చేత్తో తలపట్టుకుని చెప్పింది. ‘చెప్పద్దంటున్నాడు. ఇక్కడ జరిగేవి అతనికి తెలిసిపోతోంది...’ ఒత్తిడి ఫీలవుతూ చెప్పడం ఆపేసింది.
ఇవిట్, ఎలెన్ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. ఆ తర్వాత ఎంత అడిగినా ఆమె నోరు విప్పలేదు.
* * *
ఎలెన్ ఆఫీస్ పని మీద యూరప్ వెళ్లాడు. అతనికి వీడ్కోలు చెప్ప ఛెరిల్ టీవీ ఆన్ చేసింది. ఆమెకి అకస్మాత్తుగా మేరన్ తన దగ్గరికి రావాలని అనుకుంటున్నాడని అనిపించింది. ఎందుకు వస్తాడు? కొద్ది నిమిషాల్లో డోర్ బెల్ విని తలుపు తెరిచింది.
‘లోపలకి రావచ్చా? మీ వారు యూరప్ వెళ్లారుగా?’ మేరన్ నవ్వుతూ అడిగాడు.
‘మీకెలా తెలుసు? రండి’ ఇష్టం లేకపోయినా మర్యాద కోసం ఆహ్వానించింది.
‘మీరు ఇన్‌స్పెక్టర్ ఇవిట్‌కి నా భార్యని నేనే చంపానని ఫిర్యాదు చేశారు. అతను నన్ను ప్రశ్నించాడు. ఇది మనిద్దరికీ మంచిది కాదు. నా ఆలోచనలు మీకిలా తెలిసిపోవడం నాకు అసలు మంచిది కాదు. అదృష్టవశాత్తు నేనా రోజు నా కారుని ఉపయోగించలేదు. లేదా పట్టుబడేవాడిని. నీలం రంగు సూట్‌కేస్‌తో పౌలా లేచి పోతోందని తెలీగానే...’ అతను ఒక్కో అడుగు తన వైపు వేస్తూ చెప్తూంటే ఛెరిల్ భయంగా వెనక్కి నడిచింది. ఆమె మెడ చుట్టూ అతని చేతులు బిగుసుకుంటూండగా చెప్పాడు.
‘ఇది నాకు మంచిది’
* * *
1960లలో ఇంగ్లండ్‌లోని దినపత్రికలన్నీ మేరన్ కేసు గురించి రాసాయి. ఇన్‌స్పెక్టర్ ఇవిట్ అతన్ని ట్రాప్ చేసిన విధానాన్ని కూడా పేర్కొన్నాయి. నిజానికి ఛెరిల్ భర్త ఫ్రాన్స్‌కి వెళ్లకపోయినా వెళ్తున్నట్లుగా చెప్పడం వల్లే టెలిపథిక్‌గా మేరన్ అది తెలుసుకున్నాడు. ఇవిట్ పన్నిన ఉచ్చులోకి మేరన్ నడిచాడు.
కాని కోర్టు టెలిపతిక్ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మేరన్‌ని హత్యా ప్రయత్న నేరం మీద జైలుకి పంపింది. ఆనాడు దినపత్రికలు వేసిన ప్రశ్నలు. వారిద్దరికీ ఒకరి ఆలోచనలు మరొకరికి టెలిపతిక్‌గా తెలిసాయా? తెలీకపోతే పౌలా హత్య గురించి ఛెరిల్‌కి ముందే ఎలా తెలిసింది? ఎలెన్ ఫ్రాన్స్‌కి వెళ్లిన సంగతి మేరన్‌కి ఎలా తెలుసు? మేరన్ కాకపోతే అతని భార్యని ఎవరు చంపారు? దేవుడికే తెలియాలి.