S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతరిక్షంలో ‘సరస్వతి’ (విజ్ఞానం)

అంతరిక్షం.. ఎన్నో అద్భుతాలకు నెలవు. మనిషి ఎప్పటికప్పుడు తన మేధకు పదునుపెడుతూ అంతరిక్ష రహస్యాల ఛేదనకు ఉత్సుకత చూపుతూనే ఉన్నాడు. ఖగోళశాస్తవేత్తల చూపంతా ఆ నిశీధివైపే. కొత్త విషయం కనుగొన్నప్పుడు వారి కళ్లల్లో మెరిసిపోయే వెలుగురేఖలు ప్రపంచానికి దారిచూపిస్తుంటాయి. ప్రస్తుతం ఓ అద్భుత విషయాన్ని ఖగోళ శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. భూమికి నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఓ గెలాక్సీని కొత్తగా కనిపెట్టారు. కొన్ని లక్షల నక్షత్రాలు, ధూళి, గురుత్వాకర్షణ శక్తితో అవి పరిభ్రమిస్తుండటం వారి కంటబడింది. గతంలో ఈ ‘గెలాక్సి సూపర్‌క్లస్టర్’ను ఎవరూ చూడలేదు. హిందూ పురాణాల్లో మేధస్సుకు, విద్య, విజ్ఞానానికి అధిదేవతగా చెప్పుకునే దేవత సరస్వతి. ఆమె పేరునే ఈ నూతన ‘గెలాక్సి సూపర్ క్లస్టర్’కు పెట్టారు. భారతీయ ఖగోళ శాస్తవ్రేత్తలు దీనిని గుర్తించారు. భూమికి చేరువలో ఇప్పటివరకు కనిపెట్టిన ‘పాలపుంత’ల్లో ఇది అతిపెద్దదిగా భావిస్తున్నారు. యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమి అండ్ ఆస్ట్ఫ్రోజిక్స్ (ఐయుసిఎఎ), పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఇఆర్), భారతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన మరో ఇద్దరు శాస్తవ్రేత్తలు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. సోలన్ డిజిటల్ స్కై సర్వేగా చెప్పుకునే ఈ విస్తృత పరిశోధనలో ‘్భరీ గోడలాంటి పాలపుంతల సమూహాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాం’ అని ఈ పరిశోధక బృందానికి సారథ్యం వహించిన జయదీప్ బాగ్చి, శిశిర్ సంఖ్యాయాన్ చెప్పారు. కొత్తగా కనిపెట్టిన ఈ సరస్వతి సూపర్‌క్లస్టర్ దాదాపు 600 కాంతి సంవత్సరాల దూరం వరకు విస్తరించి ఉంటుందని, బహుశా 20 మిలియన్ బిలియన్ సూర్యుళ్లతో ఇది కూడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ విశ్వం ఏర్పడిన పది వందల కోట్ల సంవత్సరాలనాటికి ఇది ఏర్పడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. మొదట చిన్నచిన్నగా ఉన్న పాలపుంతలు కొన్ని కలసి ఇలా సూపర్‌క్లస్టర్‌గా ఏర్పడుతుంటాయని భావిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ‘సరస్వతి’లాంటి సూపర్‌క్లస్టర్లు ఎక్కువగా ఉండి ఉండకపోవచ్చన్నది వారి అంచనా. కేరళ, జంషెడ్‌పూర్ ఎన్‌ఐటిలకు చెందిన ప్రొఫెసర్లుకూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. కాగా కొత్తగా కనిపెట్టిన విషయం ఇప్పటివరకు ఉన్న అనేక సిద్ధాంతాలపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితిని కల్పించింది.