S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చీమలకు రెక్కలొస్తాయెందుకు!

చినుకులు పడ్డప్పుడు, లేదా మండువేసవిలో రెక్కల చీమలు, రెక్కల చెదపురుగులు విస్తృతంగా కనిపిస్తాయి. లెక్కలేనన్ని పుట్టుకొస్తాయి. ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. కానీ మామూలుగా ఉండే ఈ చీమలకు రెక్కలు ఎందుకు వస్తాయి. ఇది ఓ ప్రకృతిధర్మంగా చెప్పుకోవాలి. చీమలు సమూహంగా కలసిమెలసి ఉంటాయి. వాటిలో రాణిచీమ సంతానోత్పత్తి చేస్తుంది. మగచీమలు సంపర్కం తరువాత చనిపోతాయి. కొన్నిలక్షల చీమల సమూహాన్ని కాలనీ అంటారు. అది నిండిపోయినప్పుడు కొత్త కాలనీలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఈలోగా ఈడుకొచ్చిన ఆడ, మగ చీమలు జతకట్టే సమయం వస్తుంది. వాతావరణం అనుకూలించినప్పుడు ఇలా జతకట్టాల్సిన ఆడ, మగ చీమలకు రెక్కలొస్తాయి. అవన్నీ ఒకేసారి ఎగిరి గాలిలో ఉండగానే సంపర్కం జరుపుకుంటాయి. ఆ తరువాత మగచీమలు త్వరితగతిన మరణిస్తాయి. ఆడచీమలు కొత్త ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వాటిలో మళ్లీ రాణి చీమ సంతానోత్పత్తి చేస్తుంది. అన్ని మగ, ఆడ చీమలు సంతానోత్పత్తి చేయలేవన్నది ఓ నిజం. కొత్తకాలనీల ఏర్పాటు, సంతానోత్పత్తి కోసం ఈ చీమలు ఉన్న కాలనీని విడిచిపెట్టి బయటకు రెక్కలతో వస్తాయన్నమాట!

- ఎస్.కె.కె. రవళి