S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాగితాల కర్టెన్

అందంగా, రాజసంతో జారాడిన ఈ కర్టెయిన్ బాగుంది కదూ! ఇది పూర్తిగా భవన నిర్మాణంలో వాడే ఒక తరహా పేపర్‌తో తయారు చేసినది. ఇక్కడే కనిపిస్తున్న మరికొన్ని అందమైన నిర్మాణాలూ అలాంటి పేపర్‌తో చేసినవే. నమ్మలేకపోయినా అది నిజం. అమెరికా భవన నిర్మాణ రంగంలో పేరుగాంచిన స్టూడియో గాంగ్, అమెరికా నేషనల్ బిల్డింగ్ మ్యూజియం అనే సంస్థ నిర్వహించే సమ్మర్ బ్లాక్ పార్టీలో ఈ కళాఖండాలను ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. తుదిమెరుగులు పూర్తయ్యాక సెప్టెంబర్‌లో సందర్శకులను అనుమతిస్తారు. చికాగో, న్యూయార్క్‌లలో ఈ ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ కర్టెన్‌లా ఉన్న కళాఖండాన్ని గతంలో ‘మార్బుల్ కర్టెయిన్’ పేరుతో తయారు చేశారు. ఈ పక్కన డూమ్ మాదిరిగా తయారు చేసిన కళఖాండానికి ‘హైవ్’ అని పేరుపెట్టారు. దాదాపు 2700 పేపర్ ట్యూబ్‌లతో దీనిని రూపొందించారు. ఒక్కో ట్యూబు కనీసం పది అడుగుల పొడవు, అదే వ్యాసార్థంతో ఉంటే అతిపెద్దవి 60 అడుగుల పొడవు, పది అడుగుల వ్యాసార్థంతో ఉన్నాయి. రీసైకిల్ చేసిన తేలికపాటి ఈ పేపర్‌ను మళ్లీమళ్లీ వాడుకోవచ్చుకూడా. బాగుంది కదూ సరికొత్త కళ.

- భారతి