S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారసత్వ నగరం

ఆరువందల ఏళ్లుగా తమ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తున్న అహ్మదాబాద్ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించడం, ఆ గుర్తింపు పొందిన ఏకైక నగరం ఇదే కావడం భారతీయులందరికీ గర్వకారణం. కవర్‌స్టోరీ ‘వారసత్వ విజయం’లో అహ్మదాబాద్ విశేషాలు చక్కగా అందించారు. బహుమతి కథ ‘నేలతల్లి’ బాగుంది. పారిశ్రామిక వాడలవల్ల ఎన్ని సమస్యలొస్తాయో బాగా వివరించారు. ఆత్మలతో మాట్లాడటం, సమ్మోహనపరచడం లాంటి ప్రక్రియల ద్వారా నేరస్థుడు, అతని ఫియాన్సీలతో నిజం చెప్పించడం క్రైం కథ ‘పిలుపు’లో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంది.
-కె.సుధీర్ (శ్రీనగర్)
రసాయనాల కుప్ప
మనుషులనబడే రసాయనాల కుప్పలకు తెలివి వచ్చింది. మనుషులు భూమి మీద ఉన్నారు. కాని భూమి లాంటివి విశ్వంలో మరెక్కడా లేవంటూ ఆలోచించి ఆలోచించి ఎన్నో శాస్త్ర విషయాలు బాగా చెప్పారు గోపాలంగారు. బ్లాక్‌విడో స్పైడర్ల గురించి, బెర్రి పళ్లతో ఆడుకునే వాక్స్‌వింగ్ పక్షుల గురించిన ఆసక్తికరమైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వీడియో గేమ్స్ వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని, మరపు నుంచి రక్షణ దొరుకుతుందని చెప్పడం బాగానే ఉంది. కాని పిల్లలు వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడటంవల్ల చదువుపై శ్రద్ధ తగ్గి పరీక్షలు తప్పుతున్నారన్నదీ నిజమే. తస్మాత్ జాగ్రత్త!
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
నీతి
ఈ లోకంలో కృతజ్ఞతతో ఉండటం ఎంత ముఖ్యమో దాన్ని వ్యక్తీకరించడం అంతకన్నా ముఖ్యం అని ‘ఓ చిన్న మాట’ గొప్ప నీతిని చెప్పింది. ‘్భక్తిలేని నరజన్మ ఎత్తి ఏమి?’ అన్నారు అమృతవర్షిణిలో. అలాగే రచయిత రుడ్యర్డ్ కిప్లింగ్ ముస్సోరిలోని పాడుపడ్డ డాక్‌బంగ్లాలో బస చేయడం, పక్క గదిలో ఎవరో బిలియర్డ్స్ ఆడుతున్న శబ్దాలు వినిపించడం 10, 15 ఏళ్ల క్రితం అక్కడ దొరలు ఆ ఆట ఆడుతూ ఒకాయన చనిపోవడం గురించి కేర్ టేకర్ చెప్పడం, అక్కడ దెయ్యం బిలియర్డ్స్ ఆడుతున్నట్టు రచయిత భావించడం నమ్మవలసిందే. దెయ్యాలున్నాయంటే ఉన్నట్టే మరి!
-జె.్ధర్మతేజ (గొడారిగుంట)
కథ
‘నేలతల్లి’ కథ బాగుంది. పంట పండించి, తాను అనుభవిస్తూ, అందరికీ అన్నంపెట్టే రైతుకి భూమి అతని పొలం ప్రాణప్రదం. తల్లితో సమానం అని నిరూపించారు. అలాగే అనువుగానిచోట అధికులమనరాదు’ అంటూ మిడిసిపడకూడదనే సత్యాన్ని చక్కగా చెప్పారు ‘సండే గీత’లో. ‘అమృతవర్షిణి’ శీర్షిక బాగుంటోంది. కథాసాగరం.. వినదగు శీర్షికలు ఎప్పటి మాదిరిగా అలరించాయి.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
వారసత్వ విజయం
ఆదివారం అనుబంధంలో కవర్‌స్టోరీ ‘వారసత్వ విజయం’ చాలా బాగుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందడం భారతీయులందరికీ గర్వకారణం. భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి నగరం అహ్మదాబాద్ కావడం విశేషం. శింగరాజుగారి ‘నేలతల్లి’ కథ చాలా బాగుంది. క్లాప్ కొట్టు గురూలో సినిమా విశేషాలు బాగుంటున్నాయి.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)
తెలివి
కథ చిన్నదైనా ‘అనుమానం ప్రాణ సంకటం’ అనే వారి పట్ల ఎలా ప్రవర్తించాలో, లోకపు రీతి ఎలా ఉందో ‘తెలివి’ కథ తెలిపింది.
-కేఆర్కే మూర్తి (పాకల)
భేషైన కార్టూన్లు
కార్టూన్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచాయి. ‘అమ్మాయిని పెళ్లిలో చూస్తానులే’ అనటం నేటి వాణిజ్య సరళి, ‘ముహూర్తం టైం అయినా అమ్మాయి మేకప్ పూర్తి కాలేదు’ అని చెప్పటంలో చెణుకులు మిళితమై హాస్యాన్ని పుట్టించాయి.
-శ్రీమతి సుజాతరావు (కావలి)
అహంభావం
మనం అధికులం అన్న అహంభావంతో ఇతరులను అవమానించరాదు. చెప్పదలచుకున్నది సుతిమెత్తగా ఎవరూ బాధపడకుండా చెప్పాలంటూ వేమన పద్యం సాక్షిగా చెప్పిన ‘సండే గీత’ చాలా బాగుంది. జూలో అద్దాల గదిలో చేరిన 4 నెలల గున్న బాగుంది. డ్రోన్‌తో తీసిన మెలికల దారి ఫొటో అద్భుతం. ఈ వారం ఎన్ని కవితలో! ‘చెమట సంతకం’ ఆలోచింపజేసింది. దానిలో ‘నా సంతకం ఎగురుతుంది. నా సంతకం తూర్పురేఖల స్వప్నం. నా సంతకం పిడికిలి ఎత్తిన ఎర్రజెండా’ అన్న భావన మేలు బంతి. అలాగే ‘చీకటిలో వెతుకుతున్నా వెలుగులా వస్తావని’ అన్న హైకూ బాగుంది. కవితలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి.
-శాండోప్రచండ్ (తూ.గో.జిల్లా)
శబ్దం
‘ఓ చిన్న మాట’లో ‘శబ్దం’పై చక్కని వివరణ ఇచ్చారు. ప్రేమలు, ఆత్మీయతలు, ఆలోచనలు, అడవిలో పడిన చెట్టులాగ కాకుండా ఎంతో బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని తెలిపిన విధానం మాకెంతో నచ్చింది. ‘సండే గీత’లో -అవకాశాలు గురించి - అవకాశాలను మనం సృష్టించుకోవాలి. వాటిని ఉపయోగించుకుంటేనే భవిష్యత్ బాగుంటుందని వివరించినందుకు ధన్యవాదాలు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)