S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటికి కేన్సర్ రానేరాదు

‘నేక్‌డ్ మోల్ రాట్’గా పిలిచే ఈ క్షీరదజాతి జీవికి ఎలుకలతో సంబంధమే లేదు. కనీసం చుంచులతోనూ వీటికి సంబంధం లేదు. నిజానికి గినియాపందులు, ముళ్ల పందులు వీటికి బంధువులు. దాదాపు నగ్నంగా ఉన్నట్లు కనిపించే శరీరంతో ఉన్నా దాదాపు వంద వెంట్రుకలు వాటికి ఉంటాయి. నిరంతరం పెరిగే పైన, దిగువ ఉండే పొడవైన పళ్లను అవి చాప్‌స్టిక్స్‌లా ఉపయోగిస్తాయి. చీమల మాదిరిగా ‘కాలనీ’ వ్యవస్థ వీటికి ఉండటం ప్రత్యేకత. రాణి, మగ, సేవక మోల్‌రాట్‌లు గుంపులుగా కలసి జీవిస్తాయి. వీటి కాలనీల్లో ఆహారానికి, శృంగారానికి, విసర్జనకు వేర్వేరు గదులను ఏర్పాటు చేసుకుంటాయి. చూడటానికి అన్నీ ఒక్కలాగే ఉన్నప్పటికీ వాటిలో ప్రతీదానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఆ వాసనబట్టి అవి ఎదుటివారిని గుర్తిస్తాయి. చివరకు అవి విసర్జించిన వాటిని కూడా వాసనబట్టే గుర్తిస్తాయి. అన్నట్లు ఆక్సిజన్ లేకుండా దాదాపు 20 నిమిషాలపాటు జీవించగల వీటికి కాన్సర్ దాదాపుగా రాదు. శత్రువుదాడినుంచి రక్షించుకునేందుకు వరుసగా నిల్చుని, తమ పళ్లను అడ్డంగాపెట్టి ఓ గోడలా కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. వీటి జీవితకాలం దాదాపు 20 ఏళ్లు.

- ఎస్.కె.కె. రవళి