S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘జాగ్వార్’లు అమెరికాలోనే ఉంటాయి!

పిల్లిజాతికి చెందిన ‘జాగ్వార్’ (పులులు)లు అమెరికాలో దేశాల్లోనే కనిపిస్తాయి. దొంగచాటుగా దాడిచేసి ఒక్కగెంతులో శత్రువును నోటకరచి పుర్రెను కొరికి చంపేయడం వాటి ప్రత్యేకత. ‘యాగ్వార్’ అనే భారతీయ పదం నుంచి ‘జాగ్వార్’ అన్న పేరు దానికి వచ్చింది. దాదాపు 85 రకాల ఆహారాన్ని తినే ఈ పులుల శరీరంపై రోజా పువ్వులాంటి మచ్చలు ఉంటాయి. చిరుతల్లా ఇవి చెట్లు ఎక్కి నక్కి ఉంటాయి. అనకొండ పాములు మాత్రమే వీటికి సహజ శత్రువులు. నిజానికి వీటికి ఎదురౌతున్న పెద్ద ప్రమాదం మానవులే. చెరువులు, నదుల్లో ఈతకొట్టగల ఈ పులుల్లో పూర్తిగా నల్లగా ఉండేవీ ఉంటాయి. అతిదగ్గరగా, జాగ్రత్తగా పరిశీలిస్తే వీటి నల్లని శరీరంపై నల్లగానే రోజాపువ్వులాంటి మచ్చలు కనిపిస్తాయి. పిల్లుల జాతిలో మూడవ అతిపెద్ద జీవులు ఇవి. పెద్దపులులు, సింహాల తరువాత ఇవే పెద్దవి. అప్పుడప్పుడు అవకొడ పళ్లను ఇవి ఆరగించడం మామూలే.

- ఎస్.కె.కె. రవళి