S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకృతి సోయగానికి దర్పణం

జర్మనీలోని గలెండ్‌లో ప్రతిష్టాత్మక ‘సెనిక్‌బ్రిడ్జ్’ను చూసిన ఫొటొగ్రాఫర్ లోరెంజ్ హోల్డర్ ప్రత్యక్షంగా దానిని చూడాలని అనుకున్నాడు. తన మిత్రుడు, అథ్లెట్ సె నడ్ గ్రోసిక్‌తో కలసి అక్కడికి వెళ్లాడు. సెనెడ్ ఆ బ్రిడ్జ్‌పై సైకిల్‌తో వెడుతున్న సందర్భంలో ఎలాంటి ఫొటోలు తీయాలా అని లోరెంజ్ ఆలోచిస్తున్న సమయంలో ప్రకృతి కూడా సహకరించింది. అందమైన వసంతవేళలో పిల్లగాలి కూడా సవ్వడి చేయకపోవడం, నిశ్ఛలంగా ఉన్న సెలయేటి నీరు, అప్పుడే తొంగిచూస్తున్న సూరీడు ప్రకృతి సోయగాన్ని ఇనుమడింప చేశారు. ఆ సమయంలో సెనిక్ బ్రిడ్జ్ ప్రతిబింబం ఆ సెలయేటిలో అద్భుతంగా కనిపించింది. మూడుసారు ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించిన లొరెంజో మరికొన్ని తీద్దామనుకునేలోగా ఇకచాలన్నట్లు గాలివీయడంతో సెలయేటిలో అలలు సవ్వడి చేశాయి. మరో దృశ్యం ఆవిష్కృతమైంది. లోరెండ్ తీసిన మూడు ఫొటోల్లో ఇది ఒకటి.

- భారతి