S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జెయింట్ ఫైట్

కెనడా 150వ వార్షికోత్సవం సందర్భంగా ఒట్టావాలో ఓ అద్భుత ప్రదర్శన ప్రజలను అలరించింది. చైనా పురాణాల్లో చెప్పుకునే జెయింట్ డ్రాగన్ (సగం డ్రాగన్, సగం గుర్రంలా), జెయింట్ స్పైడర్‌లను పోలినట్లుండే మెషిన్‌ల మధ్య ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాలు ఒట్టావాలో నడిరోడ్డుపై నాలుగు రోజుల పాటు ప్రజలను అలరించాయి. ఫ్రాన్స్ చెందిన లా మెషిన్స్ అనే సంస్థ, కెనడా ప్రభుత్వం సంయుక్తంగా ఈ పోటీని నిర్వహించాయి. 12 మీటర్ల ఎత్తు, 45 టన్నుల బరువు ఉన్న ఈ జెయింట్ డ్రాగన్ హార్స్ ‘లాంగ్ మ’ రెక్కల్లో ఒకదానిని 20 మీటర్ల ఎత్తున్న జెయింట్ స్పైడర్ ‘కుమొ’ పీకి పట్టుకుపోతుంది. ఆ జెయింట్ స్పైడర్ ఆచూకీ కనుగొని తన రెక్కను తిరిగి స్వాధీనం చేసుకుని శత్రువును తుదముట్టించడం డ్రాగన్ పని. ఈ భారీ యంత్రాలను కొందరు నియంత్రిస్తారన్నమాట. నీటిని, జ్వాలలను నోటినుంచి వెదజల్లే ఏర్పాట్లు ఈ జెయింట్ డ్రాగన్‌లో ఉండటం, అవి ప్రదర్శించడం విశేషం. వేలాదిమంది ప్రజలు ఈ ప్రదర్శనను ఆస్వాదించారు.

- భారతి