S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారతీయత

సీతాకోక రెక్కలతో ఎగిరే
రంగుల ముగ్ధ మోహనత!
హరివిల్లులా విరబూసే
అందాల అద్దకపు కలనేత!

చీరంటే మన దేశ చరితకు ముఖచిత్రిక
చీరంటే మగువ మనసుకు భావ గీతిక
చీరంటే ప్రతి కంటికి ప్రశాంత వీచిక

అమ్మమ్మ కడితే తరతరాల కలబోత
అమ్మ కడితే అనురాగాల ఆప్యాయత
అమ్మాయి కడితే వలపుల పూదోట
పాపాయి కడితే పాలనవ్వుల దొంతర

అమ్మమ్మ కొంగులో చందమామ కథలు
అమ్మ కొంగులో అనుబంధాల గంధాలు
అమ్మాయి కొంగులో సిగ్గుల మందారాలు
పాపాయి కొంగులో నవ్వుల పాలపుంతలు

చీరంటే నదులకే వయ్యారాలు నేర్పిన ఘనత
చీరంటే సిగ్గులకే సింగారాలు అద్దిన విరినేత
చీరంటే భక్తికి ముక్తిని చూపే పతివ్రత

ఎనె్నన్ని వలువలు వనె్నచినె్నలు చూపినా
చీర ముందు సకలం తలవంచాల్సిందే!
మాతృత్వానికి చిరునామా
స్ర్తిత్వానికి నజరానా!
*

-పుట్టి గిరిధర్ 9491493170