S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచినీళ్లలో ప్లాస్టిక్ విషాలు ( మీకు మీరే డాక్టర్)

ఫ్రశ్న: ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత వద్దని చెప్తున్నారో అంతగా వాటి వినియోగం పెరుగుతోంది. పూర్వం గాజు సీసాల్లో సిరప్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు అన్నింటికీ ప్లాస్టిక్‌నే వాడుతున్నారు. ముఖ్యంగా మంచినీళ్ల బాటిల్స్ కేవలం ప్లాస్టిక్‌లోనే దొరుకుతున్నాయి. దీనివల్ల అపాయాల గురించి వివరంగా చెప్తారా?
-ప్రసాద్ జేగోటి (నిడదవోలు)
జ: ప్రపంచవ్యాప్తంగా మనుషులంతా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లను తాగటం అనే పెద్ద తప్పు చేస్తూనే ఉన్నారు. నీళ్లు ఫ్రిజ్‌లో పెట్టుకోవటానికి ప్లాస్టిక్ బాటిల్ కావాలి. నీళ్లను కొనుక్కోవటానికి ప్లాస్టిక్ బాటిళ్ళు కావాలి. ‘మేం మినరల్ వాటర్ మాత్రమే తాగుతాం’ అని గొప్పగా చెప్పుకునే వాళ్లంతా పెద్ద వాటర్ బాటిల్‌ని కొనుక్కుని, దాన్ని పెద్ద బిందె ఆకారంలో ఉండే ప్లాస్టిక్ బాటిల్ మీద బోర్లించి ఉంచుతారు. మొత్తం మీద 24 గంటలూ మనుషులు తాగుతోంది ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లనే. ఇది పట్టణ వాసుల్లో ఎక్కువ. ఇప్పుడు పల్లెసీమలకూ పాకింది.
మినరల్ వాటర్ అనేది ఒక స్టేటస్ సింబల్‌గా భావించుకునే వాళ్లకు తాము ప్లాస్టిక్ వలన విషపూరితమైన నీటిని తాగుతున్న విషయం తెలీదు. ఇది నిజం. ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వవుంచే నీళ్లు ప్లాస్టిక్ విషానికి గురౌతాయి. ఇది గంగాజలం, హిమాలయాల నుంచి నేరుగా వచ్చాయని టీవీల్లో ప్రకటన ఇవ్వగానే నిజమే కాబోలని నమ్మేస్తాం. ఒళ్లు రుద్దుకునే సబ్బులు రసాయనాలతోనే తయారౌతాయి. దాన్ని గంగాజలంతో తయారుచేసామంటే నిజంగానే నమ్మేస్తాం. వాణిజ్య ప్రకటన బలం అలాంటిది. అది మనలో మోహాన్ని ప్రేరేపిస్తుంది. ప్లాస్టిక్ వాడకం గానీ, ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు, ఆహార పదార్థాలు గానీ అలాంటి మోహావేశంలోనే మనల్ని ముంచెత్తుతున్నాయి. వాటికి మనం తెలియకుండానే దాసోహం అంటున్నాం.
ప్లాస్టిక్ వాడకం అనేది ఆహార పదార్థాలను, పానీయాలను నిల్వ వుంచేందుకు, ఒక చోటు నుండి ఇంకో చోటుకు మోసుకువెళ్లేందుకు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్గులూ తేలికగా ఉపయోగపడుతున్నాయి. వాటిని వాడద్దంటూనే ఉన్నారు శాస్తవ్రేత్తలు. మనమే వినిపించుకోవటం లేదు. ప్రభుత్వం మొక్కుబడి నిషేధం విధించి ఊరక చూసే పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ అమెరికాలో 60 మిలియన్ల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ని వాడ్తున్నారని ఒక అంచనా. మనం అంతకన్న ఎక్కువే వాడ్తున్నాం.
పోలీ కార్బొనేట్ ప్లాస్టిక్స్, ఇంకా కొన్ని రకాలైన రెజిన్సో ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్ తయారౌతాయి. వీటిని స్థిరీకరించటానికి (stabilize) ‘బిస్ఫెనాల్ ఎ’ (BPA) అనే రసాయనాన్ని కలుపుతారు. బాటిల్స్ గానీ, సంచులు గానీ ప్లాస్టిక్ వాసన రావటానికి కారణం ఇదే. దీనిలో వేడి వస్తువులు ఉంచినప్పుడు గానీ, వాటికి వేడి తగిలినప్పుడు గానీ, చ్ఘిఖన ళఒఆ్యళశ అనే ఒక విష రసాయనం తయారౌతుంధి. ఇది కలిసిన ఆహార పానీయాల వలన ఒవేరియన్ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. గర్భవతులు ఈ ప్లాస్టిక్ విషాహార పానీయాలు తీసుకుంటే పుట్టే బిడ్డకూ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నది తీవ్రమైన హెచ్చరిక.
పెట్ బాటిల్స్: Poly ethylene terephthalate (PET) అనే రసాయనాన్ని కలిపి ఈ సీసాలు తయారుచేస్తారు. ఇవి బిపియె బాటిళ్లకన్నా ఎక్కువ ప్రమాదకరమైనవి.
పివిసి బాటిల్స్: Polyvinyl chloride అనే రసాయనంతో తయారయ్యే బాటిల్స్‌ని Phthalates అంటారు. ఇవి కూడా ప్రమాదకర విషయాలు ఆహార పానీయాల్లో కలిసేలా చేస్తాయి.
ఏ విధంగా చూసినా మంచినీటి అవసరాల కోసం ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ, హోటళ్లలో కూడా ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి చెప్పండి. ఆహార పదార్థాలను, పానీయాలను ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో ఉంచకండి. ఫ్రిజ్‌ల్లో మంచినీటిని పెట్టుకోవటానికి రాగి బాటిల్స్ ఉత్తమం. మంచినీటి కుండని మించిన సాధనం మరొకటి లేదు. కుండను ఈసడించి, ప్లాస్టిక్‌ని నమ్మటం, భక్తుణ్ణి తూలనాడి దెయ్యం వెనకాల వెళ్లటం లాంటిది.
మినరల్ వాటర్ మంచీ చెడూ గురించి మనం వేరే మాట్లాడుకుందాం. ఒక పథకం ప్రకారం మన చేత బలవంతంగా మంచినీటిని ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి కొనకపోతే చస్తావనేంతగా భయపెడుతున్న వ్యాపార వలల్లో చిక్కుకుపోతున్న వాస్తవాన్ని గుర్తించకపోతే నష్టపోయేది మనమే. అది మినరల్ వాటరైనా, మామూలు నీళ్లైనా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచకండి.
బావి నీళ్లు, చెరువు నీళ్లు, కాలవ నీళ్లు, కుంటల్లో, సరస్సుల్లో నీళ్లు, బోరు నీళ్లు వీటన్నింటిలోనూ ఊరి మురుగుని తెచ్చి వదిలే ప్రభుత్వ యంత్రాంగ ఉదాసీనత మనుషుల దాహార్తి కోసం ‘మంచి’నీళ్లు లేకుండా చేసింది. మునిసిపాలిటీ అధికారులు తాము మంచినీరే సరఫరా చేస్తున్నామని ప్రకటించి మినరల్ వాటర్ కాకుండా కుళాయి నీళ్లు తాగగలరా? సమస్త మానవాళీ మంచినీటి మీద నమ్మకం కోల్పోయింది. ఇందుకు సిగ్గు పడాల్సింది ప్రభుత్వలే!
మామూలు హోటల్‌లో 100 రూపాయలకే భోజనం దొరుకుతుంది. కానీ 500 రూపాయల బిల్లు వేసే బడా నక్షత్రాల హోటల్‌కు వెళ్తే అక్కడ మినరల్ వాటర్ బాటిల్ ఎక్స్‌ట్రా తెమ్మంటారా? అనడుగుతారు. ఒక భోజనానికి ఐదు రెట్లు రేటు తీసుకునే వాళ్లు గుక్కెడు ‘మంచి’నీళ్లు ఇవ్వలేకపోతున్నారా? వారి వ్యాపార ప్రయోజనానికి మనం శాయశక్తులా తోడ్పడుతున్నాం. ఇలా మనం త్రాగటానికి, వండుకోవటానికి, రేపు స్నానానికీ, శౌచానికీ కూడా మినరల్ వాటర్ కొని తీరాల్సిన పరిస్థితిని చేజేతులా తెచ్చుకుంటున్నాం. 40 రూపాయల టిఫిన్ చేసి 20 రూపాయల మినరల్ వాటర్ తాగుతున్నాం. ఏదో ఒకనాటికి మనకు జ్ఞానోదయం అయ్యాక పూర్వపు పద్ధతిలోనే మన మరచెంబూ మన గ్లాసూ వెంట తీసుకుని వెళ్లాల్సిన రోజులు ఎంతో దూరంలో లేవు.
పూర్వం ప్రసిద్ధ రాక్షసులంతా మరణం లేకుండా వరమివ్వాలని బ్రహ్మనో శివుణ్ణో అడిగిన వాళ్లే. వాళ్లందరి కోరికా ఆ యుగాల్లో తీరలేదు. రావణాసురుడు, హిరణ్య కశ్యపుడు ఇత్యాది రాక్షసులంతా ఈ యుగంలో ప్లాస్టిక్కై పుట్టారు. ప్లాస్టిక్ నశించేది కాదు. నాశనం లేనిదాన్ని పుట్టించటం మనిషి తన గోతిని తానే తవ్వుకోవటం అవుతుంది. ప్లాస్టిక్ వధ తనవల్ల కాదని భగవంతుడికీ తెల్సు. అందుకే ఈ వౌనం.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com