S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుణ్యకార్యం (కథ)

కనకాపురంలో రాముడు, రంగడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరివీ ఒక్కలాంటి స్థితిగతులే.
రంగడికి పుణ్యకార్యాలంటే ప్రీతి. ఆసక్తి ఎక్కువ. అలాగే దానధర్మాలు అన్నా శ్రద్ధ. శ్రద్ధగా ఏ రోజు, ఏ కాలంలో, ఏ మాసంలో ఏం చేస్తే పుణ్యమో చదివి, విని అలా ఆచరించేవాడు. అంటే కార్తీకమాసంలో దీపాలు, వస్త్రాలు, వైశాఖంలో గొడుగులు, చెప్పులు ఇలా శాస్త్రాలు చదివి వాటి ప్రకారం దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవాడు.
రాముడు అలా కాదు. అతనికి పుణ్యకార్యాల్లో ఆసక్తి, నమ్మకం రెండూ లేవు. పైనించి ఎవరైనా దానం అడిగినా, వాళ్లని వంద ప్రశ్నలు వేసి, తప్పదు అనుకుంటేనే ఇచ్చేవాడు.
చివరికి వృద్ధాప్యం వచ్చింది ఇద్దరికీ. కాలం చేశారు. తనతోపాటుగా స్వర్గానికి వచ్చిన రాముడిని చూసి ఆశ్చర్యపోయాడు రంగడు.
‘ఇదేమిటి? నాతోపాటు ఇతనికీ స్వర్గ్ధాపత్యమా? ఏం పుణ్యాలు చేశాడని? పైనించి ఏదైనా ధర్మం, దానం చెయ్యాలన్నా పుట్టుపూర్వోత్తరాలన్నీ అడిగి ఇచ్చేవాడు’ అన్నాడు కోపంగా రంగడు.
‘నిజమే. నువ్వు పుణ్యకార్యాలు చేశావు. కానీ నువ్వు కేవలం పుణ్యం కోసం, పుణ్యం వస్తుంది అనుకున్నవి మాత్రం చేశావు. పుణ్యం రాని కార్యక్రమమైతే అవతలి వ్యక్తి ఎంత అవసరంలో వున్నా, ఇచ్చేవాడివి కావు. కానీ రాముడు అలా కాదు. అవతలి వ్యక్తి అవసరాన్నిబట్టి ఇచ్చేవాడు. అందుకే అన్ని ఆరాలు తీసేవాడు. దానివల్ల ‘అపాత్రదానం’ కూడా అవదు. అందుకే అతనికి కూడా స్వర్గప్రాప్తి వచ్చింది. అంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకుని ‘మానవ సేవ’ చేశాడు’ అన్నారు విష్ణ్భుటులు.

-ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి