S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెప్పండి చూద్దాం...

వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతకడానికి రూ.7, బట్టలు డ్రై మెషిన్‌కి రూ.6 రీఛార్జ్ కార్డుతో మెషిన్‌లో ఫీడ్ చేయాలి. 10 రోజుల క్రితం కార్డు పోయిందని, కొత్త కార్డు తీసుకున్నారు. ఇంట్లో వేరే దానిగురించి వెతకగా పోయిందన్న రీఛార్జ్ కార్డు దొరికింది. అందులో రూ.2 బాలెన్స్ ఉంది. ఆ అవౌంట్ దేనికి సరిపోదని పారేద్దాము అనుకున్నాడు తాత. ఇంతలో లెక్కల్లో తెలివైన పక్కనున్న మనవడు, తాత ఆ కార్డు పారేయద్దు ఉంచు అన్నాడు. అందుకు మనవరాలు వంత పాడింది. ఆ కార్డులో రూ.40, 80, 120, 160 వేయచ్చు. అయితే ఎంత సొమ్ము వేస్తే ఆ రెండు కార్డులు వాడగా పాత కార్డు రూ.0 అవుతుంది. మీరూ ఆలోచించి చెప్పండి.
జవాబు: మనవడు అన్నాడు. ‘తాతా రూ.40 వేస్తే చాలు, బాలెన్స్ రూ.42 అవుతుంది. ఒక్క డ్రైకి వాడితే రూ.6న7 సార్లు వాడచ్చు. అప్పుడు ఆ కార్డ్ పారేయవచ్చు అన్నాడు. (ఎప్పుడూ వాష్‌కి మాత్రం వాడకూడదు)
మనవరాలు అంది. ‘తాతా, తమ్ముడు చెప్పినట్లు చేస్తే వాషింగ్‌కి వచ్చిన ప్రతిసారి డ్రై మిషన్‌కి ఎప్పుడూ ఆ పాత కార్డే వాడాలనే టెన్షన్ బాధ. పొరపాటున ఒక్కసారైనా వాష్‌కి వాడితే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఆ కార్డుని రూ.160తో ఛార్జ్ చేస్తే చాలు. దానితో బాలెన్స్ రూ.162 అవుతుంది. ఒక్క వాష్ మరియు డ్రైకి వాడితే రూ.6+7 =రూ. 13న12= రూ.156, ఇంకా రూ.6 మిగులుతుంది. దానితో 13 డ్రైకి వాడితే బాలెన్స్ రూ.0 అవుతుంది. అప్పుడు ఆ కార్డ్ పారేయవచ్చు’ అంది ఇంకా తెలివిగా.

-చామర్తి