S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిరక్షణపై ‘కన్ను’

సముద్రాలు, వాటిపై ఆధారపడి మనుగడ సాగించే జీవరాశి పరిరక్షణ కోసం తపించే ఫొటోగ్రాఫర్ గైగాపిరా. తీరాలవెంబడి తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీయడం అతడి హాబి. మెక్సికో తీరంలో అలా వెళుతూ ఓ ద్రోన్ సహాయంతో తీసిన చిత్రం ఇది. మనుషుల జీవితంలో నీలినీడ అన్న అర్థం వచ్చేరీతిలో ఈ పోటీకి కాప్షన్ పెట్టాడు. ‘ఐఎమ్’ అనే సంస్థ నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ పోటీకి గైగా పంపిన చిత్రాల్లో ఇదొకటి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద ఫొటోగ్రఫీ పోటీల్లో ఐఎమ్ నిర్వహిస్తున్న పోటీ నాలుగవ స్థానంలో ఉంది. 150 దేశాల నుంచి 88 వేలమంది ఫొటోగ్రాఫర్లు పంపిన 5 లక్షల 90వేల ఫొటోల్లో ఇదొకటి. ఈ పోటీ ఫలితాలు సెప్టెంబర్ 15-17 తేదీల్లో వెల్లడిస్తారు.

- భారతి