S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిత్రకళావైభవం

ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో ఇప్పుడు చిత్రకళావైభవం కళాభిమానులను అలరిస్తోంది. యూరోపియన్ యూనియన్‌లోనే అతి పెద్దదైన ‘స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్’ ఇప్పుడు అక్కడ నిర్వహిస్తున్నారు. యూరప్‌లోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు వచ్చి బ్రిస్టల్‌లోని పలు భవంతుల గోడలు, వీధులు, సైన్‌బోర్డులు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బొమ్మలు వేస్తున్నారు. ఈ మ్యురల్ ఆర్ట్ ఫెస్ట్‌లో వేసిన బొమ్మలను ఆ తరువాత కొందరు చెరిపేస్తారు. మరికొందరు అలా వదిలేస్తారు. అలాంటి బొమ్మల్లో ఇది ఒకటి. ప్రఖ్యాత ఇంగ్లీష్ గాయకుడు, ‘బీటిల్’ బృంద సహ వ్యవస్థాపకుడు జాన్ లెనన్ చిత్రం ఇది. ఈ భారీబొమ్మకు క్రేన్ సహాయంతో తుదిమెరుగులు దిద్దుతున్నారు. బ్రెజిల్‌కు చెందిన మ్యురల్ ఆర్టిస్ట్ ఎడ్వర్డ్ కొబ్ర ఈ గాయకుడికి ఇలా నివాళి అర్పించాడన్నమాట.

- భారతి