S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నా కవులతో నేను

ఒంటరి గదిలో ఒక్కడిగానే ఉంటాను
బయటకి వెళ్లినప్పుడు
బాహ్య ప్రపంచం నన్నావరిస్తుంది
లౌకిక ప్రయోజనాలకు
పిచ్చిపిచ్చి ఆలోచనకు
లోనైపోతుంటాను.
ఒక్కొక్కప్పుడు ఒంటరి గదిలో
ఒక్కడినే ఉంటుంటాను
నాకెదురుగా నా కవులున్నారు
వారికి నీరాజనం సమర్పిస్తాను
నాతో వారు మాటాడుతున్న అనుభూతి
నాకేదో సూచనలేస్తున్న స్ఫూర్తి
అప్పుడు నేను మారిపోతాను కవిలా
అతద్‌గుణాలంకారంలా
వాల్మీకి వారు ఆశీర్వదిస్తారు
వ్యాసుల వారు దర్శనమిస్తారు
కాళిదాసు కమనీయంగా కన్పిస్తారు
భారవి పల్కరిస్తారు
దండి నాతో విహరిస్తారు
నన్నయ్య వెంటనుంటారు
తిక్కన నా భావనలో
తిరుగాడుతుంటారు
మా తెనాలి రామకృష్ణుడు
తెలివిని ప్రసాదిస్తాడు
శ్రీనాథుడు రసికతను
పోతన భక్తితత్త్వాన్ని
రాయలవారు రాజసాన్ని
గుమ్మరించిపోతారు
మల్లాది వారు శిల్పాన్ని
ఆరుద్ర అంత్యప్రాస ముద్రను
సినారె భావుకతను
నేర్పించి వెళ్తారు
నా కవితా ప్రపంచంలో
విహంగంలా విహరిస్తాను
కవుల దర్శనభాగ్యంతో
అమరత్త్వపు ఆనందాన్ని పొందుతాను
అప్పుడు
ఆ సమయంలో
నాలో
బాహ్య ప్రపంచం కన్పించదు
లౌకిక భావాలు వాంఛలు
నన్ను ఎంత మాత్రం అంటవు
తిండి తీర్థం నాకు రుచింపదు
భార్యాబిడ్డల అవసరాలుండవు
బంధుమిత్రాదులతో పనుండదు
నాలో నా కవులు
నా కవులతో నేను
ఒకరి కోసం ఒకరం
వస్తూ ఉంటాం పోతూ ఉంటాం
మాయా మర్మమెరుగని
మానవత్త్వపు పోకడలు
మనసు విప్పుకొని
నెమలిలా పురివిప్పుకొని
ఆడుకుంటూ ఉంటాం
పాడుకొంటూ ఉంటాం
అనుగ్రహపు వర్షంలో
ఆనందంగా నర్తిస్తాను.
*

-డా.సాయి వరప్రసాదరావు 9394888752