చాలును
Published Friday, 18 August 2017ప్రేమగ నాతో - చేరిన చాలును
నిలువగ నీ దరి - కోరిన చాలును
కమ్మెను వలపుల - మేఘం తానై
ఒకపరి తలపుల - దూరిన చాలును
వరమే నీవనె - ఆశలు ఇంకెను
ప్రాణము నీవుగ - మారిన చాలును
జన్మలు నీకై - ఎత్తగ లేనిక
జీవిక ఈ గతి - పోరిన చాలును
రాధా మాధవ - వినవా కృష్ణా!
మదిలో మధువై - వొలికిన చాలును