S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలలు

మొంగరంలా భ్రమణం..
సమూహాల చుట్టూ!
మెరుపుతీగ బంధమేదో వుంది
రహస్యమిదే!!

ఉన్మాదులై వీధుల్లో తిరుగుతున్న
ఈ అభాగ్యులెవరు?
ప్రేమ పరిమళం కళ్లాపు చల్లిన
హృదయాల్తో, ఆనందడోలికల్లో
నిండుగా గడపాల్సిన కాలమంతా
అయ్యో... వీధి పాలవుతుందే?!

నగరమంతా జనసంద్రమ్
మరి ఒక్కొక్కరు
అనాధలై
అభాగ్యులై
అశాంతులై
ఏమిటీ జీవితం!

నేస్తమా
అహాల్ని వదిలేసి
ప్రేమకు హృదయాల్ని
బార్లగా తెరుద్దాం
కలల్ని పండించుకుందాం..!!
బతుకుల్ని వెలిగించుకుందాం..!!
*