S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 2 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రయత్న కార్యసిద్ధి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులను అదుపులో పెట్టండి. నైపుణ్యంతో పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి. వ్యాపార వ్యవహారాలందు రాబడి. స్పెక్యులేషన్‌పై శ్రద్ధ పెట్టండి. అనుకోని రాబడి వస్తుంది. విలువైన వస్తువులు అందుకుంటారు. తొందరపాటు వద్దు. తెలిసీ తెలియక తలనొప్పులు తెచ్చుకోవద్దు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అనే్వషణ శుభప్రదం. జయప్రదం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

మనసును నిలకడగా ఉంచుకోవాలి. ఆర్థిక స్థితి సంతృప్తినిస్తుంది. బంధుమిత్రుల వ్యవహారాలు మీ ప్రమేయంతో చక్కబడతాయి. కావలసిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి. సంతానం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. జామీను ఉండకండి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తత మేలు. విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్త వహించాలి. దంపతులు సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలున్నాయి. నూతన సమస్యలు రాకుండా లక్ష్యాలు నిర్దేశించుకోండి. వృత్తి, వ్యాపార, వ్యవహారాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఈ వారం మీకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలు రాణిస్తాయి. ఆర్థిక శుభాలు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. గతంలో వున్న సమస్యల నుండి బయటపడతారు. సోదర సఖ్యత. ఉత్సాహంతో ఉంటారు. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. మంచి మాటలు మీ విలువను ఇనుమడింపజేస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. ఇతరులను గమనించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆర్థిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం చేకూరుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్లండి. వాహన సౌఖ్యం. కొన్ని మార్పులున్నాయి. గృహ, ఆర్థిక యత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై ఆధిక్యత పొందుతారు. నూతన పరిచయాలు ప్రయోజనకారిగా ఉంటాయి. సంతాన సౌఖ్యం. సమస్యల నుండి బయటపడతారు. ప్రశాంతత లభిస్తుంది. దైవ సంబంధ కార్యాల్లో పాల్గొంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు నైపుణ్యంతో పరిష్కరించుకొంటారు. ఊహకందని విషయాలు తెలుస్తాయి. ఆందోళన పడకండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. స్ర్తిల ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అనుకున్నవి అన్ని రంగాలోనూ అందుకోనున్నారు. ప్రభుత్వ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విరోధాలు, సమస్యలు లేకుండా ప్రయత్నించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆలోచనతో నైపుణ్య ఫలాలు అందుకుంటారు. దూరపు హితులు వచ్చేట్లు ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు పూర్తి చేస్తారు. మనోధైర్యంతో ముందుకెళ్లండి. పిల్లల విషయాలపై ఓ కన్ను వేసి ఉంచండి. దంపతులు సంయమనం పాటించుకోవాలి. వ్యాపార, వృత్తి, ఉద్యోగ రంగాలు తృప్తినిస్తాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. విలువైనవి అందుకుంటారు. ప్రయాణాలందు జాగ్రత్త వహించాలి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఆర్థిక వ్యయాలను నియంత్రించుకోండి. తులనాత్మక పరిశీలనలు మంచి పట్టునిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. హితులు మీ సహాయానికై ఎదురుచూస్తారు. గృహ నిర్మాణ పనులు కలసి వస్తాయి. కుటుంబ విస్తరణ ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థితి. కొత్త పరిచయాలు అనుకూలం. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. కొత్త దంపతులు సంయమనం పాటించాలి. పెద్దవారిని కలుసుకుని లాభ ప్రయోజనాలు అందుకుంటారు. కీర్తి వృద్ధి. మిత్రులతో ప్రయాణాలు. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

చేపట్టిన రంగాలు తృప్తినిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాణిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. భూ సంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రభుత్వ కార్యాలు పూర్తి చేసుకుంటారు. సామరస్యంతో సమస్యల నుండి బయటపడతారు. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభాలు. స్ర్తిల వ్యాపారాలు ఆలోచింపజేస్తాయి. అనుకోకుండా మీ నడవడిక ఇతరులకు అనుకరణకు అనుకూలం. విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగ రంగం వారు అనుకోని సంతోషాలను పొందుతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

వృత్తి, వ్యాపారాల్లో ఉన్నతి. ఉద్యోగులకు ప్రగతి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తుంటే పనులు సానుకూల పడతాయి. శిరోబాధలు లేకుండా చూసుకోండి. శారీరక గాయాలు, ప్రమాదాలు ఉండేట్లున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఊహించని సమస్యలు ఉంటాయి. ఉద్రేకాలు విడనాడాలి. ఉత్సవాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు వనరులు చూసుకోండి. స్ర్తిల మాట వినండి. నిర్ణయాలు స్వయంగా తీసుకోండి. శుభాలను అందుకోండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

పట్టుదలతో, నైపుణ్యంతో కార్యసిద్ధి. ఆర్థికానుకూలం దెబ్బతినకుండా ప్రణాళికలు వేసుకోండి. అప్పులు భారమవుతాయి. చేసే వృత్తి, వ్యాపారాలు ఇతరులను ఆలోచింపజేస్తాయి. ప్రభుత్వ పథకాలందు పెట్టుబడులు అందుకుంటారు. భయాందోళనలు విడనాడండి. బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. విరోధ భావం వద్దు. ఆరోగ్యం జాగ్రత్త. కొత్త పరిచయాలు లాభిస్తాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఉద్రేకానికి లోనుకాకండి. చాకచక్యంగా మాట్లాడండి. కొన్ని పనులు మధ్యలోనే ఆగేట్టు ఉన్నాయి. విరోధ భావాలు వద్దు. వ్యాపార రంగంలో అనుకూల మార్పులు తక్కువ. సమయానికి పైకం దొరికినప్పటికీ వ్యయం విషయంలో ఆలోచించండి. వాహన ప్రయాణాలు అవసరమైతేనే చేయండి. స్ర్తిలు మంచి వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులను నియంత్రించుకోవాలి. కొత్త పరిచయస్తులను గమనించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

పరిస్థితులకు అనుగుణంగా లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా లోటుండదు. సోదర సహకారాలు అందుతాయి. స్ర్తిలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి రావచ్చు. కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చేట్లున్నాయి. ప్రయాణాలందు జాగ్రత్త. బంధువులను పరామర్శించాల్సి ఉంటుంది. విలాసాలను నియంత్రించుకోండి. గృహ నిర్మాణాలు కలసి వస్తాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855