S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? (సెప్టెంబర్ 10 నుండి 16 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక సమతుల్యతను సాధిస్తారు. ఒత్తిడిని జయించాలి. పనుల్లో ఏకాగ్రత పెంచుకోండి. అన్ని విషయాల్లో పటిష్టత, ఇష్టత మెరుగుపరచుకోండి. అన్నింటా స్తబ్దత లేకుండా యత్నించండి. ఈ వారమంతా పనుల వత్తిడితో గడుపుతారు. హితుల రాకతో సంతోషం. ఆంతరంగిక విషయాలందు గోప్యత పాటించండి. పుష్కలమైన శుభాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక ప్రగతి. బాధ్యతలను పరులకు అప్పగించకండి. స్పెక్యులేషన్ మిశ్రమం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ప్రముఖులతో సంప్రదింపులుంటాయి. మొహమాటం వద్దు. భాగ్యవృద్ధి. వృత్తిలో గుర్తింపు. వ్యాపారంలో హితులు సాయపడతారు. ఇతరులకు మీ సహాయం అవసరమవుతుంది. దైవ కార్యాలలో పురోగతి. ప్రయాణాలుంటాయి. పెట్టుబడులకు అవకాశాలు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు నిర్వహిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అనుకోని ప్రయాణాలుంటాయి. ఉద్యోగాల్లో మార్పులు యోగదాయకం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

కాలం యోగిస్తుంది. కార్యసిద్ధి. పటిష్టమైన ప్రణాళికలు చేసుకోండి. ఆర్థిక వృద్ధి. విశ్రాంతికై వెదుకులాట ఉంటుంది. సన్మానాలు, ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు సంప్రదాయానుకూలంగా సాగుతాయి. సుఖప్రదమైన వాతావరణం ఉంటుంది. తలచిన కార్యాలు నెరవేరుతాయి. స్ర్తిలు అనుకున్నవి సాధిస్తారు. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రగతి. తొందరపాటుతనం వద్దు. స్పెక్యులేషన్ మిశ్రమం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శ్రమానుకూలత. కృషికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటారు. ధనవృద్ధి. వస్తు, వాహన లాభం. ఖర్చులు అనుకూలంగా ఉంటాయి. సలహాలు సంప్రదింపులున్నా మీ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించండి. సంకల్ప సిద్ధి. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. పెద్దల పరిచయాలతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఉద్యోగాదులలో శుభ పరిణామాలు. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

విజయావకాశాలుంటాయి. స్తబ్దత విడనాడండి. సమస్యలను అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమాధిక్యత. మెళకువ పాటించండి. ఆర్థిక వ్యవహారాలు శుభాలనిస్తాయి. తొందరపాటుతనం వద్దు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభ శకునాలున్నాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ప్రయాణం చేయాల్సి వున్నప్పటికీ ఆలోచించి చేయండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అనుకున్నవి నెరవేరుతాయి. నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార వ్యవహారాలు సంతోషాన్ని కలిగిస్తాయి. అందరూ మీ చర్యలను అనుకరిస్తారు. స్పెక్యులేషన్, పెట్టుబడులకు, రాబడులకు అనుకూలం. అన్నింటా శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తు విద్వత్తును పెంచుతుంది. ఉద్యోగ రంగంలో శుభ పరిణామాలు. ధనప్రాప్తి. ఖర్చులందు మెళకువ పాటించండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

వ్యవహారాదులు ఆశ్చర్యపరుస్తాయి. అనుకున్నవి నెరవేరుతాయి. కష్టపడి పనిచేస్తేనే సత్ఫలితాలుంటాయని గ్రహించండి. గృహంలో శుభ వాతావరణం నెలకొంటుంది. పేరు, మన్ననలు పొందుతారు. పొరపాట్లు దొర్లుతాయి. సర్దుబాటు భవిష్యత్తుకు సోపానం. స్పష్టతతో వ్యవహరించండి. అపోహలు తొలగనున్నాయి. ఆర్థిక వృద్ధి. స్పెక్యులేషన్ మిశ్రమం. స్ర్తిలకు అవకాశాలు మెండు. మానసిక ప్రశాంతతకై వౌనం పాటించండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

మంచి తరుణం. ఆశించిన కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఆలోచనలు అనుకూలిస్తాయి. బుద్ధి బలం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులకు కలిసివచ్చే కాలం. గృహ లాభం. వస్తు వస్త్ర లాభాలు. ప్రశంసలు అందుకుంటారు. స్పెక్యులేషన్ మిశ్రమం, దీర్ఘకాలికం. ఆధ్యాత్మిక కార్యాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టే కార్యాలు మెరుగవుతాయి. అనుకోని శుభాలను అందుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

సంకల్ప సిద్ధి. విజయప్రాప్తి. ఎంచుకున్న రంగం అనుభవసారాన్ని హితులు పొందుతారు. వృత్తి, వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. వత్తిడిని నివారించుకోండి. ఉద్యోగ రంగంలో ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యానికై మెళకువలు పాటించండి. పెట్టుబడులు వనరులకు అనుగుణంగా వ్యవహరించుకోవాలి. సత్ఫలితాలు అందుకుంటారు. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మంచి వార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శ్రద్ధ, మెళకువలు పాటించండి. అశ్రద్ధ, అనవసర ఆలోచనలు కూడదు. మీరు మీ హద్దుల్లోనే ఉండటం మంచిది. విమర్శలున్నప్పటికీ పట్టించుకోకుండా సమాధానాలు లౌక్యంగా చెప్పటం నేర్చుకోండి. హితుల వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక విషయాలలో నైపుణ్యం మేలు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అనుకున్న, ఎంచుకున్న రంగాలు ఫలప్రదం.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

మీ మాటలు వినేవారిని ఆశ్చర్యపరుస్తాయి. విజ్ఞతతో మెలగాలి. వదిలివేసిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన కార్యాలు నెరవేరుతాయి. ఆదాయ వ్యయాలందు సంతృప్తి కానవస్తుంది. ఎంచుకున్న అన్ని రంగాలందు తృప్తి కలుగుతుంది. హితులు సాయపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శాంతంగా వ్యవహరించండి. పెట్టుబడులు అనుకూలం. వార్తలు ఆలోచింపజేస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

మంచి పదవులు అందుకుంటారు. పైకం సర్దుబాటవుతుంది. అప్పులు ఇచ్చినట్లయితే తిప్పలు తప్పవు. హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. ఎదుటి వారితో జాగ్రత్త. రియల్ ఎస్టేట్ రంగం అనుకూలం. ఒప్పందాలు ఆలోచింపజేస్తాయి. ముఖ్య వ్యవహారాలలో స్వల్ప మార్పులు. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. అలవాట్లు ఇబ్బందికరంగా మారేట్టు ఉన్నాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855