S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మోహ విముక్త పురుషోత్తమ నాయకత్వం

మనకంటూ ‘అహం’ ఉంది.. ‘వ్యక్తిత్వం’ ఉంది. ‘స్వ ఇచ్ఛ’ ఉంది.. ‘ఆశ’ ఉంది.. ‘కోరిక’ ఉంది - ఇవన్నీ బలంగా ఉన్నంతకాలం మనది సామాన్య బ్రతుకే! మన ఆంతరిక బలాన్ని, ఆత్మధర్మాన్ని ఈ బాహిర ఆకర్షణలు కప్పిపుచ్చుతున్నంత కాలం మనం ఒకరి వెంట అనుచరులుగా అడుగులు వెయ్యవలసిన వారమే!
నిజానికి, ఆంతరికాలైనా, బాహిరాలైనా విశ్వశక్తి నుండి ఉద్భవించినవే. అయితే, ఆంతరికాలు ఆత్మబద్ధమై ఉంటే బాహిరాలు భౌతికబద్ధమై ఉంటాయి. బాహిరాల పరిధులు ఇహానివి.. ఆంతరికాల మూలాలు పరానివి. బాహిరాలు భూమండలంలో పరిభ్రమిస్తుంటే బహుమండలాలను పొదువుకున్న పర ప్రాంగణమైన విశ్వంలోకి ఆంతరికాలు విస్తరించి ఉంటాయి.
ఒక విధంగా బాహిరాలు కార్యకారణ సంబంధితాలు, జ్ఞాన విజ్ఞాన ప్రసూనాలు. ఈ బాహిరాలకు మనస్సు ఉంటుంది, జీవితం ఉంటుంది, దేహం ఉంటుంది, ఇంద్రియ చాపల్యం ఉంటుంది. ఫలితంగా ‘ఆకర్షణ’కు లోనవుతుండటంతో ప్రలోభం, స్వార్థం జీవిత ప్రయాణంలో స్వారీ చేస్తుంటాయి. కాబట్టి మన ప్రాపంచిక జీవనం వ్యక్తిగతం. అంటే, మనది పర్సనల్ సెల్ఫ్. ఇది ‘అనుచర’ జీవన తత్వం.
వ్యక్తులుగా మనం ప్రాపంచిక జీవనం నుండి విడివడుతూ విశ్వవ్యాప్తవౌతుంటే అంటే ఆత్మబద్ధవౌతుంటే బాహిర శక్తుల్ని ఆత్మశక్తి అధిగమిస్తుంది. బాహిరం ద్వితీయమవుతూ ఆత్మ ‘అద్వితీయ’మవుతుంది.
అదే ‘ఇంపర్సనల్ సెల్ఫ్’గా పరిణమించటం. అంటే, బాహిరంగా ప్రకృతిబద్ధమైన దేహధర్మాల కంటే, ప్రకృతిబద్ధం కాని ఆత్మ ధర్మాలకే విస్తృతి లభిస్తుంది. ప్రాపంచికానికి తలవంచక, దేహానికే కట్టుబడి ఉండక ఆత్మధర్మంతో విశ్వమిత్రగా, విశ్వశక్తిగా దేనికీ సాక్షీభూతం కాక నిర్వికారంగా కర్తవ్యోన్ముఖమై ఉంటుంది.
* * *
ఇటువంటి ‘ఇంపర్సనల్ సెల్ఫ్’నే మనం ‘ఎటర్నల్ లీడర్’ అని అంటాం. ఇహ-పర ధర్మాలను సమంగా, సమర్థవంతంగా నిర్వహించగల నాయక ప్రతిభ ‘ఎటర్నల్ లీడర్’ స్వంతం. ఇటువంటి ‘ఇంపర్సనల్ సెల్ఫ్’గల ‘ఎటర్నల్ లీడర్’గా భగవద్గీతలో ఒక్క కృష్ణుడే కనిపిస్తాడు. కురుక్షేత్రంలో తలపడ సన్నద్ధులైన పాండవ పక్షంలోను, కౌరవ పక్షంలోను ఎన్ని వందల, వేల నాయకులున్నప్పటికీ వారందరూ సమర్థ నాయకులే అయినప్పటికీ ‘పురుషోత్తమ నాయకత్వం’ ఒక్క కృష్ణుడికే స్వంతమైంది. కారణం కృష్ణుడికి మించిన ఎమోషనల్ ఫొర్టిట్యూడ్, ఇంటలెక్చువల్ రిసోర్సెస్ కురుక్షేత్రంలో ముందు వరుసలలో నిలబడ్డ ఏ అతిరథ, మహారథులకూ లేకపోవటమే. పైగా ఇరువర్గాలలోని నాయకులందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమలో లేని నాయకాంశను కృష్ణుడిలో చూడగలగటం వల్లనే!
* * *
అవును, కురుక్షేత్ర కర్మక్షేత్రంలో అనుచర గణం లక్షలు, కోట్లు. వీరందరికీ మార్గదర్శకులైన నాయకులు వేలల్లో. ఈ ప్రతిభా సంపన్నులైన నాయకులకు నాయకుడు పురుషోత్తమ నాయకుడు. ఆ అద్వితీయ నాయక మూర్తి కృష్ణుడు.
* * *
తనను తాను తెలుసుకుంటూ, తనను తాను పరీక్షించుకుంటూ, తనను తాను తూకం వేసుకుంటూ, తనను తాను ప్రత్యేకంగా చూసుకుంటూ, తనను తాను సమర్థుడిగా పరిగణించుకుంటూ, తనకు తానే నాయకత్వం వహించగల ప్రతిభాశీలి నాయకుడు. ఇంకొంత వివరణాత్మకంగా చెప్పుకోవాలంటే సమకాలీన స్థిరత్వం కోసం పరితపించే అకుంఠిత దీక్షాదక్షుడు నాయకుడు. అవును, వర్తమాన అభివృద్ధే బంగారు భవిష్యత్తుకు బాట వేసేది. కాబట్టి, తన ఆంతర్యాన్ని బాహిర వర్తనంలో ప్రస్ఫుటీకరింప చేయగల మార్గదర్శి నాయకుడు. మొత్తానికి, లక్ష్యసిద్ధి, డొక్కశుద్ధి ఉన్నవాడే నాయకుడన్నది నిర్వివాదాంశం. మరి కొంత భావగర్భితంగా చెప్పుకోవాలంటే స్పిరిట్యుయల్ పర్సనాలిటీ, ఫిలసాఫికల్ అప్రోచ్‌లను సమస్థితులుగా కలిగి వున్న ఇంపర్సనల్ లీడర్ ఎటర్నల్ లీడర్ - పురుషోత్తమ నాయకుడు. ఎటర్నల్ లీడర్ నాయకుల విషయంలో సైతం ‘ఇంతై.. ఇంతింతై’ అన్నట్టు ప్రభావపరుస్తుంటాడు.
భౌతిక అంటే ప్రాపంచిక పరిధులలో నాయక ప్రభావం పంచభూతాత్మకమే! అంటే నాయక ప్రతిభ - ట్రాన్స్‌ఫార్మింగ్, ఎమ్‌పవరింగ్, డ్రైవింగ్, మోటివేటింగ్, ఇన్‌స్పైరింగ్‌లుగా పంచభూతాత్మక దేహంలో భద్రమై ఉంటుంది. పరిణమింప చేయటం, ముందుకు నడిపించటం, ఉన్ముఖుల్ని చేయటం, ఉద్దీపింప చేయటం, శక్తిమంతం చేయటం నాయక ఆత్మకే సాధ్యం. ఒక్కొక్క మారు నాయక చేష్ట వ్యక్తిగతమనిపించినా అది సామాజిక విస్మృతిని కలిగే ఉంటుంది. కాబట్టి సమర్థ నాయకత్వం వల్ల మానసిక దారిద్య్రం క్షీణిస్తుంది. జ్ఞాన విచక్షణ పెరుగుతుంది. ఇలా సమర్థ నాయకుల వల్లనే స్థిర అభివృద్ధి, రక్షణ సాధ్యం అన్నది కాదనరాని సత్యం.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946