S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అందమైన విన్యాసం

బ్రిటన్ సారథ్యంలో యూరప్ స్థాయి వైమానిక విన్యాసాలకు గ్రీస్ వేదికైంది. తంగారా ఎయిర్‌బేస్‌లో వివిధ దేశాలకు చెందిన పైలట్లు ఆయా దేశాల ప్రతిష్టాత్మక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో సాహసోపేతమైన విన్యాసాలు ప్రదర్శించారు. సందర్శకుల ఒళ్లు జలదరించేలా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈజిప్ట్‌కు చెందిన 9మంది సభ్యుల సిల్వర్‌స్టార్ బృందం క-8ఇ కరోకరమ్ ఎయిర్‌క్రాఫ్ట్ విన్యాసాలు ఈ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. ఇక బ్రిటిష్ బృందం ఫైటర్స్‌తో జరిపిన విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. హెల్లినిక్ సభ్యులు సిహెచ్47డి ఛినూక్ హెలికాప్టర్‌లతో చేసిన విన్యాసాలు ఆహా అనిపించాయి. మరికొన్ని దేశాలు ఎఫ్16 యుద్ధ విమానాలతో ఆకాశంలోకి రెప్పపాటులో దూసుకుపోవడం, ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకుంటాయన్న భ్రమకల్పించి లిప్తపాటులో తప్పుకుని వెళ్లిపోవడం వంటి సాహస విన్యాసాలు కనువిందు చేశాయి.

- భారతి