S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాపులర్ బ్యూటీ!

గత ఏడాది మలయాళంలో మమ్ముట్టితో జోడీ కట్టిన బ్యూటీ హ్యూమ ఖురేషీ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం ‘కాలా’లో అవకాశాన్ని చేజిక్కించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘కబాలి’ తర్వాత రజనీకాంత్ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘కాలా’ చిత్రంలో సముద్రకని, అంజలి పాటిల్, షియాజీ షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా చెన్నైలో జరుగుతోంది. ఈ ఇత్రంలో నటించడం గురించి హ్యూమ ఖురేషీ పేర్కొంటూ- ‘‘ రజనీకాంత్ అంతటి సూపర్‌స్టార్‌తో నటించడం సంతోషంగా వుంది. అసలు ఆయనతో నటించే అవకాశం రావడమే అదృష్టం. నేను రజనీసార్‌తో నటించే సన్నివేశంలో ‘కాలా’లో ఎంతో స్పెషల్‌గా వుంటాయి. ఆయన నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రంలో నటించడం ద్వారా చాలా పాఠాలు నేర్చుకుంటున్నా’’ అంటోంది. మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరకు ఆపై వెండితెరకు పరిచయమైన ఈ ఢిల్లీభామ 2012లో ‘గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్’తో హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఐదేళ్లలో దాదాపు ఇరవై చిత్రాల వరకూ నటించేసిన హ్యూమ పత్రికలకు గ్లామరస్‌గా ఫొటోలు దిగి మరింత పాపులర్ అయింది.

-సమీర్