S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎఫైర్ గోల!

నటి రాయ్‌లక్ష్మీ ఎప్పుడూ వార్తల్లోనే వుంటూ వస్తోంది. ఈ భామ ఎక్కడికెళ్లినా తనపై వస్తున్న రూమర్స్ గురించే అడుగుతున్నారట. ఇది ఆమెకు పెద్ద తలనొప్పిగా తయారైందట. ముఖ్యంగా క్రికెటర్ ధోనీ గురించి పదే పదే ప్రశ్నిస్తుంటే ఆమె ఎక్కడా లేని కోపం వస్తుందట. ‘నేను ధోనీతో మాత్రమే డేటింగ్ చేశానా? గతంలో ఐదుగురుతో రిలేషన్‌షిప్స్‌లో వున్నా. వాళ్లగురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? వాళ్లూ ప్రముఖులే! కానీ, ధోనీ గురించే ఎందుకు?’ అని ఎదురు ప్రశ్నిస్తోందట రాయ్. అలాగని ఆమెను ముంబయి మీడియా ధోనీ గురించి అడగడం మానడం లేదు. అదే రాయ్‌లక్ష్మీకి నచ్చడం లేదు. బాలీవుడ్‌లో తాజాగా ఆమె ‘జూలీ-2’లో నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, సాంగ్ ప్రోమోలు చూసిన వారంతా ఈ హీరోయిన్ ఎవరో? సన్నీ లియోన్‌కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేలా కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ‘జూలీ-2’ చిత్రం ప్రమోషన్ కోసమని ముంబయి వెళ్లిన రాయ్‌లక్ష్మీని చాలామంది ధోనీ గురించే పదే పదే ప్రశ్నిస్తుంటే ‘్ధనీకి పెళ్లయింది. నేనిప్పుడు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. ప్రస్తుతానికి నాకు కెరీరే ముఖ్యం. ఇకపై ఎఫైర్స్ గురించి అడగొద్దు. ఈ ఎఫైర్స్ గోల నాకేల’’ అంటూ రాయ్ లక్ష్మీ చిరాకుతో చెప్పేసిందట. అదీ..సంగతీ!

-సమీర్