ఇక గ్లామర్ షో!
Published Saturday, 14 October 2017ఈమధ్యే అల్లుఅర్జున్ సరసన డిజెలో నటించి మంచి ఇమేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే ఊహించిన పరిస్థితికి రివర్స్ అయింది. డిజె తరువాత స్టార్ హీరోయిన్గా వెలిగిపోవాలని కలలుకన్న ఈమెకు కాస్త నిరాశే మిగిలింది. డిజెలో రెచ్చిపోయి అందాలు ఆరబోసినా కూడా పూజాకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈమె ఎలాగైనా టాలీవుడ్లో స్టార్హీరోయిన్గా వెలగాలనే సంకల్పంతో గట్టిప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఘాటు ఫొటో షూట్లతో రెచ్చగొడుతున్న పూజాకు అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఇటు తమిళంలో కానీ, అటు తెలుగులోకానీ అవకాశాలు పెద్దగా రావడంలేదు. అందుకే గ్లామర్ షోకులతో ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.