S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దటీజ్.. ప్రియాంక!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు దేశీ స్టార్ మాత్రమేకాదు.. అమెరికన్ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా చిన్ని తెరపై దర్శనమిచ్చి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాదు, ఈ ఇమేజ్ ఆమెను సంపాదనలో ఎక్కడికో తీసుకెళ్లింది. గత ఏడాది ఎక్కువ సంపాదించిన టీవీ నటీమణుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో ప్రియాంక చోప్రా స్థానం దక్కించుకున్నారు. రూ.65.52 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో ఈ బ్యూటీకి ఎనిమిదో స్థానం లభించింది. ‘క్వాంటికో’ టీవీషోతో పశ్చిమ దేశాల్లో వినోద రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక ‘బేవాచ్’ చిత్రంతో హాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిల పరుచుకుంది. అందరూ హాలీవుడ్ భామలు ఉన్న జాబితాలో ప్రియాంక చోప్రా పేరు ఉండటం విశేషం. టీవీ షోస్, యాడ్స్ ద్వారా ఈ బ్యూటీ అత్యధికంగా సంపాదించిందని పత్రిక పేర్కొంది. సో.. విదేశీ తారల జాబితాలో ప్రియాంక ఉండడం రియల్లీ గ్రేట్..దటీజ్..ప్రియాంక!