S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘హార్స్‌షూ క్రాబ్’ పీతకాదు!

హార్స్ షూ క్రాబ్ అని పిలిచే ఉభయచరం నిజానికి పీత కాదు. పీతలతో కన్నా సాలీళ్లు, తేళ్లతో వీటికి దగ్గర పోలికలు ఉంటాయి. ఇది గుర్రపు నాడా ఆకారంలో ఉండటం వల్ల అలా పిలుస్తారు. బాహ్య అస్తిపంజరం పైన ఐదు, దిగువ రెండు కళ్లున్న ఈ ‘క్రాబ్’ జోడీని వెదుక్కోవడానికి, సముద్రంపై ప్రయాణం ఏ దిశగా చేయాలన్న విషయాన్ని గ్రహించడానికి ఎక్కువగా ఉపయోగిస్తాయి. దాదాపు నలభై ఏళ్లపాటు జీవించే వీటిలో ఆడవి మగవాటికన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి పెట్టే గుడ్లలో 10 శాతం మాత్రమే పిల్లలుగా బతకగలుగుతాయి. బతికిన పిల్లలు నీటిలో తలకిందులుగా ఈదడం విశేషం. తోక ఉన్న ఈ ‘హార్స్‌షూ క్రాబ్స్’ దానిని ప్రయాణాన్ని నియంత్రించే సాధనంగా ఉపయోగిస్తాయి. కాళ్లతో ఆహారాన్ని నలిపి మింగే ఈ జీవులు భూమీద పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మార్పులకు లోనుకాలేదు. అందుకే వాటిని ‘లివింగ్ ఫాసిల్స్’గా పిలుస్తారు. అన్నట్లు వీటి రక్తం నీలిరంగులో ఉంటుంది. కాపర్‌తో కూడిన హెమోసైనిన్ వల్ల వాటి రంగు అలా ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి