S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటె తెలుసా?

పసిఫిక్ సముద్రం చుట్టూ గుర్రపు నాడా ఆకారంలో విస్తరించి ఉన్న అగ్నిపర్వతాల ప్రాంతం. ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 75 శాతం ఈ దేశాల పరిథిలోనే ఉన్నాయి. దాదాపు 40 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో, దాదాపూ 450 పైగా అగ్నిపర్వతాలు ఇక్కడే ఉన్నాయి. వీటిలో చాలావరకు యాక్టివ్‌గా ఉండటం విశేషం. కొన్ని పూర్తిగా నిర్వీర్యమైనవి, మరికొన్ని స్తబ్దతతో ఉన్నవి కూడా ఉన్నాయి. జపాన్‌లోని ఫ్యుజి అగ్నిపర్వతం అతి ఎతె్తైనది. ప్రపంచంలో వచ్చే భూకంపాల్లో 90 శాతం అగ్నిపర్వతాల విస్ఫోటనాలవల్లే వస్తున్నాయి. మిగతా పర్వతాల మాదిరిగా కాకుండా అగ్నిపర్వతాల లోపిల భాగం గుల్లగా ఉంటుంది. రాళ్లు, మట్టి, బూడిద, నీళ్లు, నిప్పు ఉండి విస్ఫోటనం చెందినప్పుడు బయటకు వెదజల్లబడతాయి.